
‘టూరిస్ట్ ఫ్యామిలీ’ (Tourist Family) చిత్రంతో ఒక్కసారిగా ప్రేక్షకులు, ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అభిషన్ జీవింత్ (Abishan Jeevinth) ఇప్పుడు హీరోగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విత్ లవ్’ (With Love Movie). ఈ సినిమాకు మదన్ దర్శకత్వం వహిస్తుండగా.. మలయాళీ బ్యూటీ అనస్వరా రాజన్ (Anaswara Rajan) కథానాయికగా నటిస్తుంది.
Read Also: Shraddha Kapoor: సినిమా షూటింగ్‌లో గాయపడ్డ శ్రద్ధా
టైటిల్ టీజర్‌ను విడుదల
ప్రముఖ నటుడు రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ (With Love Movie) చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టైటిల్ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
ఈ టీజర్ చూస్తుంటే లవ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు సీన్ రోల్డాన్ సంగీతం అందిస్తుండగా, శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. కావ్య అనిల్, సచిన్ నాచిప్పన్, తేని మురుగన్, శరవణన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: