
రోషన్ మేక కథానాయకుడిగా, ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఛాంపియన్’ చిత్రం (Champion Movie) ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, క్యారెక్టర్ లుక్స్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ (Champion Movie) ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ‘ఛాంపియన్’ ట్రైలర్‌ను లాంచ్ చేయడం సినిమాకు మరింత హైప్‌ను తీసుకొచ్చింది.
Read Also: Nidhi Agarwal: హైదరాబాద్ లులూ మాల్ ఈవెంట్‌లో నిధి అగర్వాల్‌కు అసహ్య అనుభవం
ట్రైలర్ హైలైట్స్
జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. 1938 కాలం నేపథ్యంలో, బైరాన్‌పల్లి గ్రామ చరిత్రతో ముడిపడిన కథతో, ఫుట్‌బాల్ ఆటను కేంద్రంగా చేసుకుని సాగే ఈ చిత్రం ఒక క్లాసిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: