
యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘తెలుసు కదా’ సినిమా (Telusu Kada Movie) పై ప్రేక్షకులలో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ప్రతిభావంతుడైన దర్శకురాలు నీరజ కోన రూపొందించగా,
లేడీ లీడ్‌గా శ్రీనిధి శెట్టి ,రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లవ్, ఎమోషన్, రిలేషన్‌షిప్‌ల మేళవింపుగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 17న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
Read Also: Tribanadhari Barbarik: త్రిబాణధారి బార్బరిక్ (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ
ప్రచార కార్యక్రమాల భాగంగా తాజాగా మేకర్స్ ట్రైలర్ (Trailer) ను విడుదల చేశారు. ట్రైలర్‌లో ఉన్న ప్రతి ఫ్రేమ్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.నువ్వేరోజైతే నీ ఆడదానికెళ్లి నీకన్నీళ్లు, నీ బాధ చూపిస్తావో.. ఆరోజు నువ్వే నీ జుట్టు తీసుకెళ్లి దాని చేతిలో పెట్టినోడివవుతవ్ బ్రదర్.. ఆ కంట్రోల్ ఎప్పుడూ వాళ్లకివ్వొద్దు..
పవర్ సెంటర్ ఎప్పుడూ ఇక్కడ మెయింటైన్ అవ్వాలి అంటూ సిద్దు స్టైల్‌లో సాగుతున్న డైలాగ్స్‌తో మొదలైంది ట్రైలర్. ఎవరిని ప్రేమించాలి.. ఎంత ప్రేమించాలి.. ఎలా ప్రేమించాలి అనేది మన కంట్రోల్‌లో ఉండాలి.. సిద్దు చెప్తున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
తెలుసు కదా ట్రైలర్ పై మీ అభిప్రాయం?
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: