
‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నేచురల్ స్టార్ నానితో కలిసి ‘ది ప్యారడైజ్’ (The Paradise) అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా. నేడు శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా, ‘ది ప్యారడైజ్’ బృందం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసింది.
Read Also: Boyapati Srinu: మోహన్ భగవత్ ని కలిసిన బోయపాటి
2026 మార్చి 26న విడుదల?
‘ది ప్యారడైజ్’ చిత్ర నిర్మాణ సంస్థ అయిన SLV సినిమాస్ శ్రీకాంత్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక పోస్ట్ షేర్ చేసింది.స్వతహాగా ఇంట్రోవర్ట్, నిశితమైన స్వభావం కలవారు. కానీ సెట్స్‌లో మాత్రం ఎంతో ప్యాషనేట్, ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటారు. ఆయనే మన ‘సైలెంట్ మాన్‌స్టర్’ శ్రీకాంత్ ఓదెలా (Srikanth Odela).
మా టీమ్ #TheParadise తరఫున మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు! అంటూ చిత్రయూనిట్ పోస్ట్ చేసింది. ‘ది ప్యారడైజ్’ సినిమాను 2026 మార్చి 26న తెలుగు, హిందీ, తమిళం సహా మొత్తం ఎనిమిది భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: