
తెలుగు ప్రేక్షకులకు ‘జెర్సీ’ చిత్రంతో బాగా పరిచయమైన నటి శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) ఇప్పుడు వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ‘ది గేమ్: యూ నెవర్ ప్లే అలోన్’ (The Game You Never Play Alone) అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సిరీస్‌కు ప్రతిభావంతుడైన దర్శకుడు రాజేష్ ఎం. సెల్వా దర్వకత్వం (Rajesh M Selva Director) వహిస్తుండగా, నెట్‌ఫ్లిక్స్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి..
Nagarjuna- ఏఐ టెక్నాలజీ దుర్వినియోగంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున
అక్టోబర్ 2 నుంచి ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఇప్పుడే ప్రేక్షకుల్లో చర్చనీయాంశమైంది.ఈ ట్రైలర్ (Web Series Trailer) చూస్తుంటే శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో గేమ్ డెవలపర్‌గా నటిస్తుంది. అనుకొకుండా ఆమెపై అటాక్ జరుగుతుంది. అయితే ఆ అటాక్ చేసిన వాళ్లనూ, వాళ్ల వెనకున్న వాళ్లనూ ట్రాప్ చేసే ఆమె ప్రయాణమే ఈ సిరీస్.
శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో గేమ్ డెవలపర్‌గా నటిస్తుంది
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో, స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్‌తో ఆడియన్స్‌కి విభిన్నమైన అనుభూతిని అందించేలా సిరీస్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. నిజం, అబద్ధం మధ్య సన్నని గీత గురించి చెప్పే కథ ఇదని దర్శకుడు రాజేష్ ఎం.సెల్వా అన్నారు. సంతోష్ ప్రతాప్, ఛాందినీ, శ్యామ హరిణి, బాలహాసన్, సుభాష్ సెల్వం, వివియా సంతోష్, ధీరజ్, హెమా ఇందులో ముఖ్య పాత్రధారులు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: