
శర్వానంద్ (Sharwanand) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ నారీ నారీ నడుమ మురారి ’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 2026 ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Read also: Udaipur: హీరోయిన్ నుపుర్ సనన్ వివాహం..
ట్రైలర్ లో హైలైట్స్
ఈ నేపథ్యంలో, ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రానున్న ఈ ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పంచుతోంది. పాత ప్రేమ కథ తన ప్రస్తుత వైవాహిక జీవితాన్ని నాశనం చేయకుండా ఓ యువకుడు పడే పాట్లను సరదాగా చూపించారు.
సంక్రాంతికి, ముఖ్యంగా జనవరి 14వ తేదీకి శర్వానంద్‌కు మంచి సెంటిమెంట్ ఉంది. గతంలో ఆయన నటించిన ‘శతమానం భవతి’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రాలు ఇదే తేదీన విడుదలై ఘన విజయం సాధించాయి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా, జ్ఞాన శేఖర్ వి.ఎస్, యువరాజ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: