
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇది డార్లింగ్ కెరీర్ లో ఫస్ట్ రొమాంటిక్ హారర్ కామెడీ. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అభిమానులను ఆకట్టుకుంది. ప్రమోషన్స్ లో భాగంగా ‘రెబల్ సాబ్’ అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా సాంగ్ ప్రోమోని ఆవిష్కరించారు.
Read Also: Bunny Vas: పైరసీ వల్ల చిన్న సినిమాల నిర్మాతలు నష్టపోతున్నారు: బన్నీ వాస్
ఆదివారం పూర్తి పాట విడుదల
పూర్తి పాటను ఆదివారం (రేపు) సాయంత్రం 6.11 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఈ వార్తతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. విడుదలైన ఈ ప్రోమోలో ప్రభాస్ ఎంట్రీ, ఆయన స్వాగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సంగీత దర్శకుడు తమన్ అందించిన బీట్స్ పవర్‌ఫుల్‌గా ఉన్నాయి.
మారుతి దర్శకత్వంలో ఈ సినిమా పూర్తిస్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్నట్టు ఈ ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది. “స్వేగ్ & ఎంట్రీ లెవెల్ పాన్ ఇండియా నెం.1” అంటూ మేకర్స్ ఈ ప్రోమోను పంచుకున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
జనవరి 9న విడుదల
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ సాంగ్ ప్రోమో, సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ‘ది రాజా సాబ్’ చిత్రాన్ని 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: