
తెలుగుతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఫోకస్ అంతా ఇప్పుడు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌పైనే ఉంది. ఇప్పటికే బాహుబలి ప్రాంచైజీ, ఆర్‌ఆర్‌ఆర్‌తో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజౌమౌళి. ఈ ప్రాజెక్టులతో వరల్డ్‌వైడ్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకున్నాడు జక్కన్న . ఈ సారి మహేశ్‌బాబు (Mahesh Babu) తో ఏకంగా హాలీవుడ్‌ను తలదన్నే సినిమా చేస్తూ టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు.
Read Also: Bigg Boss 9: ఈ వారం తాజా ఎలిమినేషన్ లీక్
కాగా, ఇటీవలే పోస్టర్, సాంగ్ రిలీజ్ చేసి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఇవాళ ఈ మూవీ యూనిట్ రామోజీ ఫిల్మ్ సిటీలో ‘గ్లోబ్ ట్రాటర’ అనే గ్రాండ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌లో టైటిల్ టీజర్ రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఈవెంట్ 6 గంటలకు ప్రారంభం కానుంది.
దీని కోసం అభిమానులు (Mahesh Babu) ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పాస్‌లు ఉన్నవారు ఈవెంట్‌లో సందడి చేగా.. పాస్‌లు లేని వారు ఈవెంట్ బయట రచ్చ రచ్చ చేస్తున్నారు. మహేశ్ బాబు, రాజమౌళి కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేశ్ బాబు అభిమానులు ఈవెంట్ వద్ద రచ్చ రచ్చ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: