
మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో (Women’s ODI World Cup final) భారత్ చేతిలో ఓటమి పాలైన తర్వాత సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ (Laura Wolvaardt) భావోద్వేగానికి గురైంది. తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసినప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోవడం ఆమెను కన్నీటిపర్యంతం చేసింది. లారా సెంచరీ చేసినా ఆమె, ఆ కృషి వృథా కావడంతో మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో కూర్చుని తలదించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ క్షణాలు అభిమానుల గుండెలను తాకాయి.
Read Also: World Cup 2025: భారత మహిళల జట్టును అభినందించిన సినీ తారలు
మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ జట్టు ఓటమికి కారణాలను వెల్లడించింది. ఈ సందర్భంగా భారత జట్టు బౌలర్ షెఫాలీ వర్మ (Shefali Verma) పై లారా ప్రశంసలు కురిపించింది. షెఫాలీ అద్భుతంగా బౌలింగ్ చేసిందని కొనియాడింది.
హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) తీసుకున్న నిర్ణయం
షెఫాలీకి బంతి ఇవ్వాలని హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) తీసుకున్న నిర్ణయం తమ కొంప ముంచిందని వెల్లడించింది. షెఫాలీ బౌలింగ్ ను తాము సరిగ్గా అంచనా వేయలేకపోయామని అంగీకరించింది.‘షెఫాలీ బౌలింగ్ మాకు సర్‌ప్రైజ్. చాలా నెమ్మదిగా బంతిని సంధిస్తూ కీలక సమయంలో ఇద్దరిని పెవిలియన్ కు పంపించింది.
కీలక వికెట్లను కోల్పోవడంతో మేం నిరుత్సాహానికి గురయ్యాం. ఆమెకు మరిన్ని వికెట్లు ఇవ్వకూడదని చాలా పొరపాట్లు చేశాం. వరల్డ్ కప్ ఫైనల్ వంటి మ్యాచుల్లో పార్ట్ టైం బౌలర్లకు వికెట్లు కోల్పోవడం సరికాదు. ఆమె బౌలింగ్ కోసం అస్సలు సన్నద్ధం కాలేదు’’ అని లారా (Laura Wolvaardt) వెల్లడించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: