
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇండియాకు చేరుకున్నారు. తన భార్య అనుష్క శర్మతో కలిసి ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించారు. గోట్ ఇండియా టూర్‌లో భాగంగా లియోనల్ మెస్సి భారత్‌కు రావడంతో కోహ్లీ సైతం అతడిని కలుస్తాడనే వార్తలు వినిపించాయి. డిసెంబర్ 14న ముంబైలో మెస్సి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న నేపథ్యంలో విరాట్ రాకను ఊహించారంతా. అనుకున్నట్టే శనివారం కింగ్ కోహ్లీ, భార్య అనుష్కతో కలిసి ముంబైలో ప్రత్యక్షమయ్యాడు.
Read Also: Sreeleela: అజిత్ కుమార్‌తో శ్రీలీల సెల్ఫీ
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు
కోల్‌కతా తర్వాత హైదరాబాద్‌లో వాలిపోయిన ఫుట్‌బాల్ స్టార్ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి.. రాత్రి ముంబై విమానం ఎక్కనున్నాడు. ఇటీవలే సఫారీలపై వన్డే సిరీస్‌లో రెండు శతకాలతో రెచ్చిపోయిన విరాట్ (Virat Kohli).. అత్యధిక పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. వచ్చే వన్డే ప్రపంచకప్ ఆడాలనుకుంటున్న ఈ మాజీ కెప్టెన్ 50 ఓవర్ల ఫార్మాట్లో జరిగే విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy)లో ఆడేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: