
టాలీవుడ్ యాక్షన్ హీరో సుధీర్ బాబు (Sudheer Babu) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘జటాధర’ (Jatadhara). ఈ చిత్రానికి వెంకట్ కళ్యాణ్ (Venkat Kalyan), అభిషేక్ జైస్వాల్ (Abhishek Jaiswal) సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు.
కథను వెంకట్ కళ్యాణ్ అందిస్తున్నారు. ఇది తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న బైలింగ్యువల్ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఈ చిత్రంతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు.
Read Also: Bigg Boss 9: దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్
‘జటాధర’ సినిమా (Jatadhara Movie) టైటిల్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. సుధీర్ బాబు (Sudheer Babu) లుక్ పూర్తిగా భిన్నంగా ఉండడం గమనార్హం.ఆయన పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘జటాధర’ (Jatadhara Movie) తో ఆయన కెరీర్‌లో మరో కొత్త మలుపు తిరుగుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాలో సుధీర్ బాబు యోధుని తరహాలో, ఆధ్యాత్మిక శక్తులతో కూడిన పాత్రలో కనిపించనున్నారు. సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) పాత్ర కూడా కథలో కీలక మలుపు తిప్పే విధంగా ఉంటుందని తెలుస్తోంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాను నవంబర్ 07న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ఈ ట్రైలర్ చూస్తుంటే మైథాలాజికల్, సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో సోనాక్షి శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. జీ స్టూడియో సమర్పణలో ఉమేశ్ కె.ఆర్.భన్సాల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: