
హీరో శ్రీకాంత్ తనయుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు రోషన్. ‘పెళ్లిసందడి’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అతడు నటనలో మెరుగులు దిద్దుకుంటూ క్రమంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇప్పుడు ఆయన కెరీర్‌లో కీలక అడుగుగా భావిస్తున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘ ఛాంపియన్ ’ (Champion Movie) భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రోషన్ నటిస్తున్నాడు.
Read Also: Peter Hogg: భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి సెలీనా జైట్లీ
ఫస్ట్ సింగిల్ విడుదల
ఈ సినిమాకు ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహిస్తుండగా.. స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ (Champion Movie) చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ఇప్పటికే టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసారు..
గిర గిర గిరగింగిరాగిరే అంటూ పాట రాగా.. కాసర్ల శ్యామ్ సాహిత్యంను అందించాడు. రామ్ మిరియాలా పాడగా.. మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.. ఈ చిత్రంలో రోషన్ ఫుట్‌బాల్ ఆటగాడిగా కనిపించబోతున్నాడు. మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ (Anaswara Rajan) కథానాయికగా నటిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: