
చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నేపథ్యంలో, ‘మన శంకరవర ప్రసాద్’ (‘Mana Shankara Varaprasad Garu’) చిత్రం నుంచి తాజాగా రెండో పాట విడుదల తేదీ ఖరారైంది. ఇప్పటికే విడుదలైన మొదటి పాట ‘మీసాల పిల్ల’ భారీ విజయాన్ని సాధించింది..
Read Also: Shivarajkumar: కన్నడ స్టార్ ” శివరాజ్‌కుమార్” ఆసక్తికర వ్యాఖ్యలు
రెండో పాట డిసెంబర్ 08న విడుదల
‘శశిరేఖ’ (Sasirekha) అనే పేరుతో రాబోతున్న ఈ రెండో పాట డిసెంబర్ 08న విడుదల కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా పాటకు సంబంధించిన ప్రోమోను పంచుకుంది చిత్రయూనిట్.ఈ సినిమాలో, (Chiranjeevi) చిరంజీవితో పాటు, నయనతార, విక్టరీ వెంకటేశ్, కేథరిన్, వంటి అగ్ర తారలు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, వి. హరికృష్ణ (షైన్ స్క్రీన్స్) సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: