
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న ‘మన శంకరవర ప్రసాద్’ (MSG) చిత్రం నుంచి తాజాగా రెండో పాటను విడుదల చేశారు మేకర్స్. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్‌తో భారీ అంచనాలు నెలకొనగా, ఇప్పుడు ఈ ‘శశిరేఖ’ పాట విడుదల కావడంతో ఆ ఉత్సాహం మరింత పెరిగింది. ‘శశిరేఖ’ సాంగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. భీమ్స్ సిసిరోలియో స్వరాలకు చిరంజీవి, నయనతార వేసిన క్లాసిక్ స్టెప్పులు పాటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
Read Also: Actress Pragati: ఏషియన్ గేమ్స్‌లో సత్తా చాటిన నటి ప్రగతి
ఈ పాటకు లిరిక్స్‌ను అనంత్ శ్రీరామ్ అందించగా, భీమ్స్ సిసిరోలియో మధుప్రియతో కలిసి ఈ పాటను ఆలపించారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో పాటు విక్టరీ వెంకటేశ్, నయనతార, కేథరిన్ థ్రెసా వంటి అగ్రతారలు నటిస్తున్నారు.. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, వి. హరికృష్ణ (షైన్ స్క్రీన్స్) సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: