
బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9) మరికొన్ని రోజుల్లో విజేత ఎవరనేది తెలియనుంది. ఇప్పుడు ఈ షో చివరి వారానికి వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో, బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9) కు ఎండ్ కార్డ్ పడనుంది. మొన్నటివరకు టాప్ 5 కంటెస్టెట్స్ ఎవరా అనే ఆసక్తి ఉండేది. అలాగే టైటిల్ రేసులో కళ్యాణ్, తనూజ పోటాపోటీగా దూసుకుపోతున్నారు.
Read Also: Bigg Boss 9: సెకండ్ ఫైనలిస్ట్ రేసులో టాప్‌లోకి తనూజ
ఇక ఈరోజు ఎపిసోడ్‌లో నమ్మకానికి సంబంధించి హౌస్ మేట్స్ మధ్య ఫిటింగ్ పెట్టారు నాగార్జున. ఎవర్ని నమ్మొచ్చు.. ఎవర్ని నమ్మకూడదో చెప్పాలని.. రెడ్, గ్రీన్ కలర్ ఫ్లాగ్‌లు ఇచ్చారు. హౌస్ మేట్స్ అంటూ ఫ్లాగ్స్ పెట్టారు కానీ.. తనూజకి వచ్చేసరికి ఆ ఫ్లాగ్స్ పెట్టాలంటే.. విన్నర్ ప్రైజ్ మనీ నుంచి ఐదు లక్షలు కట్ అవుతుంది నీకు ఓకేనా? అని అడిగారు నాగార్జున.దాంతో తనూజ.. ‘సార్ అది నాదీ అంటే నేను ఏమైనా చేస్తాను కానీ.. అది ఇంకొకరిది అని అన్నప్పుడు మనసు ఒప్పుకోదు సార్’ అని అన్నది.
ఆ మాటతో నాగార్జున.. ‘డిసైడ్ అయిపోయావా? ఆ ప్రైజ్ మనీ ఇంకొకరిది అని’? అని దిమ్మతిరిగే పంచ్ వేశారు. ఆ తరువాత డెమాన్ పవన్.. ఇమ్మానుయేల్ పై నమ్మకం ఉందని.. భరణిగారిపై నమ్మకం లేదని చెప్పాడు. ఆ తరువాత కళ్యాణ్.. తనూజని నమ్మొచ్చని గ్రీన్ ఫ్లాగ్.. డెమాన్‌ని నమ్మలేం అని రెడ్ ఫ్లాగ్ ఇఛ్చాడు.ఆడు చేస్తే గేమ్.. అదే పని నేను చేస్తే దెబ్బ వేయడమా? అని అడిగాడు డెమాన్.
నామినేషన్ ప్రక్రియ
దాంతో నాగార్జున.. ‘ఒరిజినల్ పవన్ ఇన్నివారాల తరువాత మాకు ఇప్పుడు కనిపించాడు’ అని పంచ్ వేశారు. ఇక తనూజ అయితే ఫ్లాగ్ పెట్టమంటే.. ఏకంగా నామినేషన్ ప్రక్రియ చేపట్టింది సంజనాకి రెడ్ ఫ్లాగ్ ఇస్తూ. అయితే ఫైనల్ టచ్ ఇచ్చిన నాగార్జున.. ఇప్పుడు నా ముందు ఏడుగురు హౌస్ మేట్స్ ఉన్నారు..
ఈవారం డబుల్ ఎలిమినేషన్ అంటూ ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ డబుల్ ఎలిమినేషన్ అనేది శనివారం నాడు ఒకర్ని. ఆదివారం నాడు మరొకర్ని ఎలిమినేట్ చేయబోతున్నారు. శనివారం నాటి ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి ఎలిమినేట్ కాబోతుండగా.. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో మరొకర్నిఎలిమినేట్ చేయబోతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: