
బిగ్‌బాస్ సీజన్ 9 (Bigg Boss 9) చివరి దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో షోకు ఎండ్ కార్డ్ పడనుంది. ప్రస్తుతం హౌజ్‌లో టికెట్ టు ఫినాలే టాస్క్‌లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హౌజ్‌మేట్స్ మధ్య గొడవలు కూడా గట్టిగానే జరుగుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో భరణి వర్సెస్ రీతూ మధ్య రసవత్తరమైన పోరు నడించింది. వీరిద్దరి మధ్య జరిగిన టాస్కులో రీతూ గెలిచింది. అయితే చివరలో నాకు డౌట్ గా ఉందంటూ పుల్ల పెట్టింది తనూజ. దీంతో ఆమెకు వంత పాడాడు భరణి. ఈ టాస్కుకు సంచాలక్ అయిన సంజనపై బిగ్ బాస్ (Bigg Boss 9) కు కంప్లైట్ చేశాడు భరణి. సంచాలక్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ నిప్పులు చెరిగారు భరణి.
Read Also: Bigg Boss 9: టికెట్ టూ ఫినాలే టాస్క్‌లో తనూజ విన్నర్
రీతూపై భరణి సీరియస్
తాజా ప్రోమోలో టాస్క్ ప్రకారం జంక్ యార్డ్‌లో ఉన్న ట్రయాంగిల్స్, స్క్వేర్స్, సర్కిల్స్ షేప్స్‌ని గుర్తించి వాటిని ముందు ఎవరు పెడితే వాళ్లు గెలిచినట్టు. అయితే రీతూ పెట్టిన వాటిలో ట్రయాంగిల్ కాదని వాయిస్ వినిపించాడు భరణి. ట్రైయాంగిల్ అంటే మూడే భుజాలు ఉండాలి. కానీ.. అక్కడ రీతూ పెట్టిన దానికి షేప్ సరిగా లేకపోవడంతో.. నాలుగు భుజాలు కనిపిస్తున్నాయని వాదించాడు భరణి. కానీ అది చూడ్డానికి మాత్రం మూడు భుజాలతో ఉన్న ట్రై యాంగిల్‌లాగే ఉంది.
నాలుగు భుజాలు ఉంటే.. రెక్టాంగిల్ అవుతుంది కానీ.. ట్రై యాంగిల్ ఎలా అవుతుంది? దీన్ని పరిగణలోకి తీసుకుని ఆమె రీతూ చౌదరిని విన్నర్‌గా అనౌన్స్ చేస్తుంది.. అది తప్పు’ అంటూ గోల గోల చేశాడు భరణి. దాంతో రీతూ చౌదరి.. నా పేరు ఎందుకు తీస్తున్నారు..దానిని ట్రయాంగిల్ అనుకుండా ఏమంటారు అంటూ అరిచింది రీతూ. దీంతో నేను నీతో మాట్లాడడం లేదంటూ అంతే గట్టిగా సీరియస్ అయ్యాడు భరణి.
భరణి విశ్వరూపం
ఆ తరువాత కళ్యాణ్‌కి సీక్రెట్ రూంలో హోస్ట్ నాగార్జున చూపించిన ఛీటింగ్ వీడియోల గురించి ఇన్ డైరెక్ట్‌గా ప్రస్తావించారు భరణి. ‘ఎక్కడెక్కడ ఛీటింగ్ జరిగిందీ.. ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందీ.. ఎక్కడ షూ చూపిస్తే మనుషుల్ని గుర్తు పట్టారో.. మొత్తం వీడియోలు బయటకు వచ్చాయి. ఇప్పటికీ నేను నోరు మూసుకుని కూర్చున్నాను’ అంటూ కళ్యాణ్, డెమాన్‌లు ఆడిన ఛీటింగ్ గేమ్‌ని బయటపెట్టాడు భరణి.
దీంతో కళ్యాణ్ మధ్యలోకి ఎంట్రీ ఇచ్చాడు. కన్ఫెషన్ రూంలో ఏం చూపించారో నాకు తెలుసు.. వీడికి (డీమాన్) కు ఆ విషయం తెలియదు.. ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు..నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యాడు కళ్యాణ్. నీ పేరు తెచ్చానా.. నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావ్ అంటూ కళ్యాణ్ మీద మీదకు వెళ్లాడు భరణి. మొత్తానికి ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న భరణి… ఇప్పుడు విశ్వరూపం చూపించాడు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: