
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న హైఓల్టేజ్ చిత్రం ‘అఖండ 2 తాండవం’ (Akhanda 2) డిసెంబరు 5న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో, ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2) నుంచి ట్రైలర్ విడుదలైంది. ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలను రెట్టింపు చేసేలా ట్రైలర్‌ను తీర్చిదిద్దారు.
Read Also: With Love Movie: ‘విత్ లవ్’ టీజర్ వచ్చేసింది
తమన్ సంగీతం సినిమాపై అంచనాలు పెంచేసింది
‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కలయికలో వస్తున్న నాలుగో చిత్రం కావడంతో అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో బాలకృష్ణ మరోసారి తన పవర్‌ఫుల్ లుక్‌తో, డైలాగ్స్‌తో ఆకట్టుకున్నారు. “His RAGE is DIVINE His POWER is DESTRUCTIVE” అంటూ విడుదల చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘అఖండ 2’ ట్రైలర్ చూసారా..! మీకెలా అనిపించిందో మీఅభిప్రాయం చెప్పండి?
భారీ యాక్షన్ సన్నివేశాలు, తమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, సంయుక్త మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట, బాలకృష్ణ చిన్నకుమార్తె ఎం. తేజస్విని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘అఖండ 2 సర్జికల్ స్ట్రైక్’, ‘అఖండ 2 తాండవం’ అనే ట్యాగ్‌లైన్స్‌తో ప్రచారం నిర్వహిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: