Vidala Rajani : ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఈ కుట్రకు కారణమన్న రజని లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలపై మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజనిపై సీఐడీ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుపై స్పందించిన రజని, మీడియా ముందు సంచలన ఆరోపణలు చేశారు.ఆమె మాటల్లో “ఈ కుట్రకు నరసరావుపేట టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలే కారణం. గతంలో ఆయన తన వ్యాపార లావాదేవీలకు సహకరించాలని మామూలు ఒత్తిడి కాదు. నేను అంగీకరించకపోవడంతో నాపై తప్పుడు కేసులు పెట్టించారు,” అని రజని ఆరోపించారు.

తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, అంతే కాకుండా జర్మనీలో ఉన్న తన మరిదిని కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారని మండిపడ్డారు. “ముందు అందరి ముందూ తానే చూస్తానని చెప్పారు. ఆ తర్వాత అక్రమ కేసులు పెట్టించేశారు,” అని విమర్శించారు. గతం నుంచే కృష్ణదేవరాయలు తనపై ద్వేషంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.”2020లో వైఎస్ వర్ధంతి సందర్భంగా గురజాల పోలీస్ స్టేషన్‌లో టీడీపీ ఎంపీ తన అధికారాన్ని చూపించారు. నా ఫోన్ డేటాను కూడా తీసే ప్రయత్నం చేశారు. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కాల్ డేటాను పరిశీలించే అధికారం ఒక ఎంపీకి ఎలా ఉంటుందో చెప్పాలి!” అని రజని ప్రశ్నించారు.తనపై నమోదైన కేసులు పూర్తిగా రాజకీయ కుతంత్రమేనని, ఈ కుట్రలో ఉన్నవారిని త్వరలోనే బయటపె