వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మకు ముంబైలోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఏకంగా వర్మకు మూడు నెలల జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చింది. 2018లో మహేశ్ చంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా వర్మపై కేసు నమోదు అయింది. అప్పటి నుంచి ఒక్కసారి కూడా వర్మ కోర్ట్ కు హాజరైంది లేదు. ఎన్నిసార్లు విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపిన వర్మ మాత్రం హాజరుకాలేదు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం ఆయనకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారునికి 3 నెలల్లో రూ.3.72లక్షల పరిహారం ఇవ్వాలని, లేదంటే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని సంచలన తీర్పు ఇచ్చింది.
