ఇవాళ వర్మ సీఐడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ వర్మ విచారణను డుమ్మా కొట్టారు.

రెండు నెలల గడువు కోరిన వర్మ

సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు:

Advertisements

టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు రాంగోపాల్ వర్మపై కూటమి సర్కార్ నమోదు చేసిన ఓ కేసులో ఇవాళ ఆయన సీఐడీకి ఝలక్ ఇచ్చారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని రాంగోపాల్ వర్మకు నోటీసులు పంపగా ఆయన విచారణకు హాజరు కాలేదు. అదే సమయంలో తన లాయర్ ను పంపి కారణం చెప్పించారు. అలాగే తన హాజరుకు రెండు నెలలు గడువు కూడా కోరారు. దీంతో సీఐడీ తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.

Ram Gopal Varma profile

యాక్ట్‌కి కారణమైన కేసు వివరాలు:

గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న జగన్ పై వ్యూహం పేరుతో సినిమా తీసిన రాంగోపాల్ వర్మ ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు, నారా లోకేష్ పవన్ కళ్యాణ్ పై ఎక్స్ లో అనుచిత పోస్టులు పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే ఒంగోలు పోలీసులు తాజాగా ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించారు. దీనిపై గత ఏడాది నవంబర్ 10న వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నవంబర్ 19, 25 తేదీల్లో రెండు సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరుకాలేదు. పోలీస్ విచారణకు హాజరుకాకుండా కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు ఆర్జీవీ. ఈనెల 4న విచారణకు రావాలని పోలీసులు మరోసారి నోటీసులు ఇవ్వగా ఈనెల 7న విచారణకు హాజరయ్యారు రాంగోపాల్ వర్మ దాదాపు 12 గంటలకు పైగా విచారణ జరిపారు. ఇప్పటికే ఆయన్ను అరెస్టు చేయకుండా హైకోర్టు ఆదేశాలు ఉండటంతో విచారించి వదిలిపెట్టారు. అదే సమయంలో వర్మకు సీఐడీ నోటీసులు పంపింది. ఇటీవల యూట్యూబ్ లో విడుదల చేసిన చిత్రంలో ఉద్రేకపూరిత చిత్రాలను తొలగిచలేదని వంశీకృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు దింతో రాంగోపాల్ వర్మ ఫై మంగళగిరి సీఐడీ పోలీస్ స్టెయిన్ లో గత ఏడాది నవంబర్ 29 న కేసు నమోదైంది. ఈ కేసు లో రాంగోపాల్ వర్మకి నోటీసులు ఇచ్చారు.ఇటీవల ఒంగోలు లో సీఐడీ అధికారులు రాంగోపాల్ వర్మకి నోటీసులు ఇచ్చి సోమవారం విచారణకు రమ్మన్నారు.

రాంగోపాల్ వర్మ స్పందన:
గతంలో కులాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై నమోదు చేసిన కేసులో విచారణకు రావాలని సమన్లు పంపింది. దీంతో ఇవాళ వర్మ సీఐడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ వర్మ విచారణను డుమ్మా కొట్టారు. తాను షూటింగ్ లో బిజీగా ఉన్నందున విచారణకు రాలేకపోతున్నట్లు వర్మ సమాచారం ఇచ్చారు.

ఆర్జీవీ అడ్వకేట్ ఏమన్నారంటే:

తన లాయర్ ను సీఐడీ ఆఫీసుకు పంపి ఏకంగా 8 వారాల సమయం కావాలని లిఖిత పూర్వకంగా సీఐడీ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. అయితే ఈ నోటీసులపై సీఐడీ అధికారులు ఎలా స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది. దీనిపై సీఐడీ అధికారులు తదుపరి నిర్ణయం తీసుకుబోతున్నారు. సీఐడీ విచారణకు హాజరు కాని వర్మను అరెస్టు చేయొద్దనే ఆదేశాలు లేనందున అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి.

Related Posts
పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్..
పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్

రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్ ను నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు నగరంలో విద్యాసంస్థలకు చెందిన Read more

Bill Gates : బిల్గేట్స్ ను ఏపీకి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
billgates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు మరియు ప్రముఖ పారుపత్యవేత్త బిల్ గేట్స్‌ను రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు. ఇటీవల బిల్ అండ్ మెలిండా గేట్స్ Read more

ప్లాస్టిక్ సర్జరీ ప్రచారం పై లేడి సూపర్ స్టార్ క్లారిటీ
NAYAN

తాను ఫేస్ కు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని జరుగుతున్న ప్రచారంపై లేడీ సూపర్ స్టార్ నయనతార క్లారిటీ ఇచ్చారు. ఆ ప్రచారంలో నిజం లేదని తాజాగా ఓ Read more

25 ఎపిసోడ్స్ గా రూపొందిన సిరీస్!
madurai paiyanum chennai ponnum

'మధురై పయనుమ్ చెన్నై పొన్నుమ్' తమిళ్ రీమేక్ తెలుగు లో 'ఆహా తమిళ్'లో ఈ నెల 14వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అందుకు Read more