కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన విషయం సంచలనంగా మారింది. ఇటీవల దుబాయ్ నుంచి భారీగా బంగారం అక్రమంగా తరలిస్తూ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె పట్టుబడ్డారు. ఈ కేసులో ఆమెకు బెయిల్ మంజూరు చేయాలనే పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. అయితే, కోర్టు తుది తీర్పును ఈ నెల 27న వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
DRI అభ్యంతరాలు – బెయిల్‌కు వ్యతిరేకం
నటి రన్యారావుకు బెయిల్ ఇవ్వకూడదని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) కోర్టును కోరింది. విచారణ సమయంలో ఆమె నేరం ఒప్పుకున్నట్లు స్టేట్మెంట్ ఇచ్చిందని అధికారులు వెల్లడించారు. దర్యాప్తులో బంగారం కొనుగోలుకు హవాలా మార్గాల్లో డబ్బు బదిలీ చేసినట్లు కూడా ఆధారాలు లభించాయని తెలిపారు. అంతేగాక, బెయిల్ మంజూరు చేస్తే మరిన్ని కీలక వివరాలు దోషుల నుంచి రాబట్టడం కష్టమవుతుందని వాదించారు.

27న తీర్పు వచ్చే అవకాశం