हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Venkaiah Naidu: భారతదేశంలో పెరుగుతున్న విడాకులపై ఆవేదన వ్యక్తం చేసిన వెంకయ్య నాయుడు

Sharanya
Venkaiah Naidu: భారతదేశంలో పెరుగుతున్న విడాకులపై ఆవేదన వ్యక్తం చేసిన వెంకయ్య నాయుడు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) ఇటీవల విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో భారతీయ కుటుంబ వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతకాల వివాహాలపై (marriages) ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ, మన సంప్రదాయాల మీద ఉన్న గౌరవం తగ్గిపోతోందని అన్నారు. మన కుటుంబ, వివాహ వ్యవస్థను చూసి ప్రపంచ దేశాలు గౌరవిస్తాయని అన్నారు.

Venkaiah Naidu:

ఫిజిక్స్‌తో పెళ్లి, కెమిస్ట్రీ లేక విడాకులు!

వివాహాల పట్ల నేటి తరంలోని దృష్టికోణం మారిపోతుందని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. “ఇప్పుడు ఫిజిక్స్ చూసి పెళ్లి చేసుకుంటున్నారు.. కెమిస్ట్రీ బాగోలేదని విడిపోతున్నారు,” అంటూ చలోక్తిగా వ్యాఖ్యానించారు. విడాకుల సంఖ్య పెరగడాన్ని ఆయన ఆందోళనగా చూశారు. “ఇది మంచి సంప్రదాయం కాదు” అని స్పష్టం చేశారు.

నిజమైన నిబద్ధతకి ఉదాహరణ వల్లూరు శ్రీమన్నారాయణ

వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) ఈ వ్యాఖ్యలు, భాజపా సీనియర్ నేత వల్లూరు శ్రీమన్నారాయణ (Srimannarayana) కు విజయవాడలో జరిగిన అభినందన సభలో చేశారని తెలిసింది. 56 ఏళ్లుగా భాజపాలో సేవలందిస్తున్న శ్రీమన్నారాయణను ప్రశంసిస్తూ, రాజకీయాలలో పదవుల కోరికకంటే నిబద్ధతే ముఖ్యమని గుర్తు చేశారు.

నాయకుల పార్టీ మార్పులు బస్సుల రాకపోకలా

నేటి రాజకీయాల్లో నాయకులు తరచూ పార్టీలు మారడం చూసి ఆయన విమర్శించారు. “ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తేలికగా అర్థం కావడం లేదు. నాయకుల పరిస్థితి బస్సుల రాకపోకలా మారిపోయింది,” అని వ్యాఖ్యానించారు.

ప్రజలకే ఆదర్శంగా మారాలి నాయకులు

ఇటువంటి పరిస్థితుల్లో కూడా వల్లూరు శ్రీమన్నారాయణ వంటి నాయకులు ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. జట్కా బండిపై తిరిగి వాజ్‌పేయి, అద్వానీ ప్రచారం చేసిన రోజుల్లో నుంచే శ్రీమన్నారాయణ భాజపా పదవుల ఆశ లేకుండా, కేవలం నిబద్ధతతో పని చేశారని గుర్తు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/nara-lokesh-creation-of-20-lakh-jobs-minister-nara-lokesh/andhra-pradesh/527222/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870