vastu shastra : ‘ధనవంతులు అవడానికి అనేకమైన తాంత్రిక మార్గాలు ఉన్నాయి’ అని చాలామంది నమ్ముతూ ఉంటారు. నిజంగా అలాంటివి ఉన్నాయా? ఉంటే అందులో సులభమైన మార్గం ఏదైనా ఉందా?
ధన ఆకర్షణ తంత్రం: డబ్బులు సంపాదించడానికి అనేక రకాల తంత్రాలు ఉంటాయి. అంటే ‘హాంఫట్’ అనగానే డబ్బుల సంచులు ఆకాశం నుండి వచ్చి పడటం కాదు. ఒక ప్రోడక్ట్ను లేదా సేవలను తీసుకొచ్చి మార్కెట్లో పెట్టి అమ్మితే దాని ద్వారా వచ్చిన డబ్బులో కొంత లాభం ఆదాయంగా వస్తుంది. వ్యాపార వ్యవహారాలలో, యుద్ధంలో, రాజనీతిలో కూడా యంత్రం, తంత్రం, మంత్రం… ఇవన్నీ ఉంటాయి. మనకు తెలిసిన తంత్రాలు కొన్ని. తెలియనివి తంత్రాలు అనేకం. తెలిసిన శాస్త్రాలు కొన్ని. తెలియని శాస్త్రాలు అనేకం. ఇక్కడ ఒక ‘మంచి ముహూర్తం’లో ప్రోడక్ట్ తయారు చేయటం ప్రారంభించటం అనేది కూడా ఒక తంత్రమే! ఒక ప్రోడక్ట్్న తయారు చేయటానికి ఒక ‘యంత్రం’ కావాలి. తయారైన ప్రోడక్ట్్న ఎప్పుడు మార్కెట్లో విడుదల చేస్తే లాభాలు వస్తాయో గుర్తించగలిగే ‘మంత్రాంగం’ కావాలి. ఏ వ్యాపారంలో, ఏ వ్యవహారంలో ‘ఎటువంటి భాగస్వాములను కలుపుకోవాలి?’ అనేది కూడా తంత్రమే! ఇట్లా యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు అనేక రకాలు. వీటికి చాలా విస్తృతార్థం ఉంది. ఏదో రాగిరేకు మీద కొన్ని అక్షరాలు చెక్కేసి అదే ఒక యంత్రం, తంత్రం అనుకోకూడదు. ఒక పాజిటివ్ ఫోర్స్ను అనుకూల శక్తిని ఒక మంచి పనికి నమ్మకంగా, స్థిరచిత్తంతో ఆహ్వానించటమే ఇందులో ముఖ్యమైన ప్రక్రియ.

సులభంగా, ఎక్కువగా ధనం సంపాదించాలనుకుంటే ‘పాజిటివ్ ఫోర్స్’ ని (అనుకూల శక్తిని) కూడా వినియోగించాలి. అది ఇంకా ప్రతిభావంతంగా పని చేయటానికి అనుకూల శక్తిని మనం ఆహ్వానించే పద్ధతిలో ఒక తంత్రం ఉంటుంది. మీరు వ్యాపారం చేసే చోట, మీరు నివసించే ఆ స్థలం వాస్తు ప్రకారం అనుకూల ప్రకంపనాలను ఇచ్చేదిగా ఉండాలి. వీలైనంతవరకు వ్యాపారం చేసే క్షేత్రంలో యజమానిగా ఎవరు కూర్చుంటారో ఆ స్థలం లేదా క్షేత్రం పాజిటివ్ వైబ్రేషన్స్ తో అంటే అనుకూల ప్రకంపనాలత పుష్టిగా ఉండాలి.
ఇంట్లో పూజ చేసే దగ్గర, గల్లాపెట్టె దగ్గర.. ఇవన్నీ కూడా బాగా పాజిటివ్ వైబ్రేషన్స్ వృద్ధి అయ్యే విధంగా ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి? యజమాని కానీ, అందులో పని చేసేవాళ్లుగానీ ఆఫీసులో కూడా ‘వాస్తు ప్రకారం అనుకూలమైన చోట’ దీపారాధన తప్పకుండా చేయాలి. ఆ దీపాలు కూడా 24 గంటలు ఉండేటట్లు చూసుకుంటే మంచిది. అలా వీలు కానప్పుడు పొద్దున, సాయంత్రం తప్పకుండా దీపారాధన ఎవరో ఒకరు చేస్తూ ఉండాలి. ఇంకా కొంచెం ఎక్కువ పాజిటివ్ వైబ్రేషన్స్ వృద్ధి చెందటానికి, వాస్తుబలం పెరగటానికి ఇది ఉపయోగపడుతుంది.

ఇంకా మంచి రిజల్ట్స్ రావటానికి ఇంకా కొన్ని సాధారణ తాంత్రిక పద్ధతులను ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ ఉదయం చేసే పూజలు సూర్యోదయానికి ఒక గంట ముందు లేదా ఒక గంట తర్వాత అంటే ఉదయం ఐదు నుండి ఏడు లోపల అయిపోవాలి. సాయంత్రం చేసే పూజలు సూర్యాస్తమయానికి ఒక గంట ముందు లేదా గంట తర్వాత అంటే సాయంత్రం ఐదు నుండి ఏడు లోపల అయిపోవాలి.
శంఖం లక్ష్మీ స్వరూపం. శంఖానికి లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంది. లక్ష్మీదేవి జలం నుండి ఉద్భవించింది. అలాగే శంఖం కూడా జలము నుంచి పుడుతుంది. శంఖాలలో అనేక రకాలున్నాయి. చాలా చిన్నచిన్న శంఖాలు కూడా లభ్యమవుతాయి. ఇవి దాదాపు ఒక సెంటీమీటర్ కన్నా ఎక్కువ ఉండవు. వీటిల్లో కూడా ‘దక్షిణావృత’ శంఖాలు కలిగి ఉంటాయి. వీటినే ‘లక్ష్మీ శంఖములు’ అంటారు. పూజా సామాగ్రి దుకాణాలలో ఇవి దొరికే అవకాశం ఉంటుంది.
పూజగదిలో పూజా సమయంలో మనం తీర్థం అమర్చే ఒక వెండి లేక రాగి పాత్రలో జలం ఉంటుంది కదా! ఈ లక్ష్మీ శంఖుని ఆ జలంలో ముంచి పైకి తీసినప్పుడు శంఖులోకి వచ్చిన నీటిని మళ్లీ అదే పాత్రలోకి ధారగా వంపేయాలి. ఇలా 11 సార్లు శంఖును ముంచి, తీసి ఆ పాత్రలోనే నీటిని ధారగా వదులుతూ ఉండాలి. ఈ పని చేసేటప్పుడు తూర్పుకు అభిముఖంగా లేదా పశ్చిమానికి అభిముఖంగా వుండాలి. ఆ సమయంలో ఇష్టదైవాన్ని చిన్నగా ఉచ్చరిస్తూ స్మరించుకోవాలి. ఉదాహరణకి ‘హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే’, ‘హరే రామ హరే రామ రామ రామ హరే హరే’. శంఖంలో పోస్తే తప్ప తీర్థం కాదు అంటారు కదా! ఇది అట్లాంటిదే అనుకోవచ్చు. ఆ పాత్రలోని జలాన్ని మీరు తీర్ధంగా తీసుకోండి.

vastu shastra : వీలైతే ఉదయం, సాయంత్రం కూడా ఇలా చేస్తే మంచిది. కుదరనప్పుడు ఉదయంపూట ఒక్కసారైనా చేయండి. ఈ సులభమైన ప్రక్రియను ‘ధన ఆకర్షణ తంత్రం’గా పరిగణించవచ్చు. ఈ తంత్రాన్ని మీరు నియమం తప్పకుండా చేయగలిగితే మీ అభివృద్ధి, మీ ధనాభివృద్ధి ఖాయం. మీకు రావలసిన డబ్బులు, వ్యాపారం.. మొ॥ అన్నీ మంచి ఫలితాలనిస్తాయి. ఒక అనుకూల శక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. సత్ఫలితాలు అనుభవంలోకి వస్తూ ఉంటాయి.
ఈ ప్రక్రియను మీరు నియమంగా చేస్తూ ఉండటం వల్ల మీరు పది మందికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగితే మీ వల్ల కొన్ని కుటుంబాలు జీవన భృతిని పొందుతూ బాగుపడుతూ ఉంటాయి. అయితే ఇది మీరు స్వార్థంతో డబ్బు సంపాదించుకోవటానికి చేస్తున్నామని కాకుండా, మీరు ‘పది మందికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో, సమాజానికి సేవ చేసే ఉద్దేశంలో చేస్తున్నాం’ అని మన సులో సంకల్పం చేసుకోండి. ఫలితాలు మరింత అద్భుతంగా ఉంటాయి.(vastu shastra)