Vastu For Income : ప్లాన్ చూపించిన పద్నాలుగు సెంట్ల భూమి. దాంట్లో సగం మా చిన్న అక్కకు ఇల్లు కట్టుకోవడానికి ఫ్రీగా ఇచ్చాను. దక్షిణ భాగంలో వున్న చిన్న ప్లాటులో నేను రెండు గదులు, వరండా పోర్టికోతో చిన్న ఇల్లు కట్టాను. ప్లాటు మధ్యలో పాత బావి వుంది. ఆ బావి వెనుక ఖాళీ స్థలంలో లోపలికి విడగొట్టి మధ్య గోడ నిర్మించి దానిపై రేకులు వేసాను. ఆ రేకులకు ముందు భాగంలో ఇల్లు కట్టాం. దక్షిణంలో ప్రహరీ తూర్పు ప్రహరీ కట్టాం. ఆ తరువాత రెండు సంవత్సరాలకు మా అక్కవాళ్లు ఇల్లు కట్టారు. ఆ ఇల్లు బావి సరిహద్దుకు ఆపించి ఇటు దక్షిణం వైపు ఖాళీ వదలకుండా రెండు గదులతో నిర్మించారు. ఇంటి పారున ప్రహరీ గోడ మా ప్రహరీ గోడ కంటే సుమారు రెండు అడుగులు ఎత్తు నిర్మించారు. ఇంటివెనుక బావి వున్న లైనులోనే బాత్ రూమ్, టాయిలెట్ నిర్మించారు. వారు ఈ ఇల్లు కట్టినప్పటి నుండి నేను ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నాను. కనుక మీరు పరిశీలించి పరిష్కార మార్గం తెలుపగలరని కోరుతున్నాను.
తూర్పు వీధి వున్నటువంటి మీ పోర్షన్కి పడమరలో వున్న మరొక ఖాళీ స్థలంలో వారు ఈశాన్య భాగంలో బావి నిర్మించారు. దానివల్ల మీకేమీ నష్టంలేదు. మీ స్థలానికి వాయువ్యం వైపున మీ అక్కగారి స్థలంలో ఆగ్నేయంలో వాళ్లు లెట్రిన్, బాత్రూమ్ కట్టారు. అది ఏ విధంగాను మీ స్థలానికి ప్రభావితం కాదు. కాంపౌండు గోడలకి సంబంధించినంత వరకు మీ స్థలం తూర్పు ప్రహరీగోడ (Compound Wall) కంటే పడమటి ప్రహరీ గోడ ఎత్తుగా వుండాలి. ఉత్తరం ప్రహరీ గోడకంటే దక్షిణ ప్రహరీ గోడ ఎత్తుగా వుండాలి. మీ సమస్యల్ని బట్టి ఆలోచిస్తే మీ స్థలం నేల మట్టం కంటే ఉత్తరం వైపు వున్న నేలమట్టం ఎక్కువ ఎత్తుగా వుండే అవకాశం వుంది. అటువంటప్పుడు మీ స్థలం నేల మట్టాన్ని ఆ స్థలం నేల మట్టం కంటే ఎక్కువగా పెంచవలసి వుంటుంది.

బావులు తవ్వకూడని ప్రదేశాలు ఏవి?
బావులు తవ్వకూడని స్థలంలో బావులు తవ్వించటం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అలా చేస్తే కలిగే నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తర వాయువ్య స్థలంలో బావి తవ్వించినా, లేక గోతులు ఉన్నా శతృబాధలు కలుగుతాయి. స్త్రీలకు మానసిక సుఖశాంతులు కరువై వాటి ప్రభావం యజమాని మీద పడి తీవ్ర దుష్ఫలితాలను కలుగుజేస్తుంది. దక్షిణ నైరుతి భాగంలో బావిగానీ, గొయ్యిగానీ వుంటే ఆర్థిక నష్టాలు, రుణభారం కలుగుతాయి. ఆ ఇంట్లో ఉండే స్త్రీలకు ఎప్పుడూ వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి. దక్షిణ ఆగ్నేయంలో బావులు, గోతులూ వుంటే యజమాని చెడు అలవాట్లకు లోనవుతారు. ధన నష్టం, అగ్నిభయం, అనారోగ్యం కలుగుతాయి. తూర్పు ఆగ్నేయంలో బావిగానీ, గొయ్యిగానీ వుంటే సంతానానికి, యజమానికీ ఆరోగ్యం చెడిపోవడం, దొంగల భయం, అగ్నిభయం మొదలయిన నష్టాలు కలుగుతాయి.

పశ్చిమ నైరుతిలో బావిగానీ, గొయ్యిగానీ వుంటే పురుషులు చెడు ప్రవర్తనకు లోనవటమే గాక భయంకరమైన వ్యాధుల బారిన పడే అవకాశాలుంటాయి. దక్షిణాన బావి తవ్వటం వల్ల స్త్రీలకు దుష్ఫలితాలుంటాయి. పశ్చిమాన బావి తవ్వటం వల్ల పురుషులకు అనారోగ్యం, అష్టకష్టాలు ప్రాప్తిస్తాయి. బావి తవ్వే ఆలోచన వచ్చినప్పుడు ఎవరో చెప్పగా విన్నదిగానీ, పుస్తకాల్లో చదివిన విషయాలను దృష్టిలో పెట్టుకొని స్వంత నిర్ణయాలు తీసుకోకుండా ‘వాస్తు’ గురించి బాగా తెలిసిన వాస్తు నిపుణులను సంప్రదించి వారి సలహా మేరకు స్థలం నిర్ణయం చేసుకోవటం శ్రేయస్కరం.(Vastu For Income)
Read This : https://vaartha.com/category/vaastu/
Read Also : vastu shastra : సంపద పెరగాలంటే?