కావలసిన పదార్థాలు:
- చిలగడదుంపలు – 3 (కుకర్ లో మెత్తగా ఉడికించుకోవాలి)
- గోధుమపిండి – 2 కప్పులు
- గోరువెచ్చని నీళ్లు – కొద్దిగా (పూరీ పిండి కలిపేందుకు)
- మైదాపిండి – 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు – తగినంత
- నూనె – సరిపడా

తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో చిలగడదుంపల ముద్ద, గోధుమపిండి,(wheat flour) మైదాపిండి, ఉప్పు, అరటీస్పూన్ నూనె వేసుకుని కొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ మెత్తగా ముద్దగా కలుపుకోవాలి. ఈ పిండిని 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత నూనె(oil) అప్లై చేసుకుంటూ చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి. తర్వాత కడాయిలో నూనె కాచి ఈ పూరీలను బంగారు రంగు వచ్చే వరకూ వేయించుకోవాలి.

Read also:hindi.vaartha.com