కావలసిన పదార్థాలు:
- రస్క్ పౌడర్ – 1 కప్పు
- చిక్కటి పాలు – 1 ½ కప్పులు
- మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు
- పంచదార – 1 టీస్పూను
- జీడిపప్పు ముక్కలు, పిస్తా ముక్కలు – గార్నిష్‌కి (మీ అభిరుచికి అనుగుణంగా)

తయారు చేసే విధానం:
ముందుగా నెయ్యి వేడి చేసి జీడిపప్పు(cashew nut) ముక్కలు, పిస్తా ముక్కలు దోరగా వేయించి,తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నేతిలో రస్క్ పౌడర్, మొక్కజొన్న పిండి వేసుకుని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దికొద్దిగా చిక్కటి పాలను(milk) పోసుకుంటూ గరిటెతో బాగా కలుపుతూ ఉండాలి, ఉండలు కాకుండా జాగ్రత్తగా కలపాలి.
మిశ్రమం చిక్కబడిన తర్వాత అందులో పంచదార వేసి బాగా కలిపి, ఆ తర్వాత ఏలకుల పొడి వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి, వేడిగా లేదా చల్లగా సర్వ్ చేసుకోవాలి.

Read also: hindi.vaartha.com
Read also:Sweet Potato Poori: స్వీట్ పొటాటో పూరీ