Poha Laddu:కావలసిన పదార్థాలు:
- అటుకులు – 2 కప్పులు
- పంచదార – 1 కప్పు
- కొబ్బరితురుము – ½ కప్పు
- యాలకుల పొడి – ½ చెంచా
- నెయ్యి – తగినంత
- జీడిపప్పు – ¼ కప్పు
- కిస్మిస్ – ¼ కప్పు

తయారీ విధానం:
కడాయిలో కాస్త నెయ్యి వేసి అటుకులు వేయించాలి. అవి కాస్త వేగాక కొబ్బరి (coconut) తురుము, యాలకుల పొడి వేసి ఇంకాస్త వేయించాలి. చల్లారాక అటుకులు గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో జీడిపప్పు, కిస్మిస్, పంచదార పొడి, నెయ్యి (ghee) వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలియతిప్పి చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. తియ్యదనం ఎక్కువ కావాలని కుంటే మిక్స్డ్ ఫ్రూట్ జామ్ కొద్దిగా కలపవచ్చు. ఇవి వారం పాటు తాజాగా ఉంటాయి.

Read also: hindi.vaartha.com
Read also: