కావలసిన పదార్థాలు:
- కందిపప్పు: కప్పు
- ఉప్పు: తగినంత
- పసుపు: అర స్పూను
- ఉల్లిపాయ: ఒకటి
- టమాట: ఒకటి
- నెయ్యి: రెండు టేబుల్స్పూన్లు
- కొత్తిమీర: రెండు కొద్దిగా
- జీలకర్ర: ఒక స్పూను
- ఆవాలు: ఒక స్పూను

Parsi Dal Recipe: మసాలా కోసం కావలసినవి:
- కొత్తిమీర తరుగు: రెండు టేబుల్ స్పూన్లు
- పచ్చిమిర్చి: రెండు
- అల్లం: చిన్న ముక్క
- వెల్లుల్లి రెబ్బలు: ఆరు
- ఎండుమిర్చి: రెండు
- జీలకర్ర: ఒక చెంచా
- దనియాలు: టేబుల్ స్పూను
- దాల్చిన చెక్క: చిన్న ముక్క
- లవంగాలు: రెండు
- మిరియాలు: అర స్పూను
- గసగసాలు: ఒక స్పూను
తయారు చేసే విధానం:
మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. స్టౌ మీద కుక్కర్ ని పెట్టి చెంచా నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు, టమాట(tomato) ముక్కలు వేయించుకోవాలి. టమాట ముక్కలు మగ్గుతున్నప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న మసాలా, పసుపు, తగినంత ఉప్పు(salt),కందిపప్పు వేసి, సరిపడా నీళ్లు పోసి మూతపెట్టాలి. నాలుగు కూతలు వచ్చాక దింపేయాలి. ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టి మిగిలిన నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర వేయించి పప్పులో వేయాలి. తరువాత కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపాలి.

Read also:hindi.vaartha.com
Read also: Soya Dum Biryani:సోయా దమ్ బిర్యానీ