Paneer Corn Vada: కావలసిన పదార్థాలు:
- స్వీట్ కార్న్ గింజలు: 1 కప్పు
- పనీర్ తురుము: ½ కప్పు
- ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగినది)
- సెనగపిండి: 2 చెంచాలు
- బియ్యప్పిండి: 1 చెంచా
- పచ్చిమిర్చి: 4 (సన్నగా తరిగినవి)
- అల్లం: చిన్నముక్క
- కొత్తిమీర తరుగు: 2 చెంచాలు
- ఉప్పు: తగినంత
- నూనె: వేయించడానికి సరిపడ

తయారు చేసే విధానం:
అల్లం, పచ్చిమిర్చి, స్వీట్ కార్న్(Sweet corn) గింజలని మెత్తగా మిక్సీలో పట్టుకోవాలి. ఒక గిన్నెలోకి ఈ స్వీట్కార్న్ మిశ్రమం, పనీర్ తురుము, సెనగపిండి, బియ్యప్పిండి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసుకుని బాగా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె (oil) పోసుకుని వేడెక్కాక పనీర్, స్వీట్ కార్న్ మిశ్రమాన్ని వడల్లా అద్దుకుని నూనెలో వేయించాలి. బంగారు రంగులోకి రాగానే తీసేసుకుంటే వేడి వేడి వడలు రెడీ అవుతాయి.

Read also: hindi.vaartha.com
Read also: