Pala Undrallu-కావాల్సిన పదార్థాలు:
- పాలు – అర లీటరు
- ఏలకుల పొడి – 1 స్పూన్
- బెల్లం తురుము – ఒకటిన్నర కప్పు
- బియ్యం పిండి – 1 కప్పు

తయారు చేసే విధానం:
స్టౌ మీద బాణలి పెట్టి అందులో నీరు (water) పోసి బాగా మరుగుతున్నప్పుడు బియ్యం పిండి వేసి బాగా కలిపి మూత పెట్టాలి. స్టౌ ఆర్పేసి, పిండి చల్లారిన తరువాత పిండిని మెత్తగా, మృదువుగా చేయాలి. చేతిని తడి చేసుకుని పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాలి. గిన్నెలో పాలు (milk) పోసి బాగా మరిగిన తరువాత బెల్లం వేసి ఏలకుల పొడి వేసి స్టౌ ఆఫ్ చేసి, తయారుగా ఉంచుకున్న బియ్యం పిండి ఉండలను పాలు చల్లారాక అందులో వేసి కలిపి మూతపెట్టాలి. పాలల్లో ఉండ్రాళ్లు రెడీ!

Read also: hindi.vaartha.com
Read also: