కావలసిన పదార్థాలు:
- మునక్కాయ ముక్కలు – పదిహేను
- ఎండుమిర్చి – నాలుగు
- దనియాలు – ఒకటిన్నర టేబుల్స్పూను
- మెంతులు – పావు చెంచా
- మినప్పప్పు – అర చెంచా
- మిరియాలు – పావు చెంచా
- జీలకర్ర – చెంచా
- చింతపండు గుజ్జు – ఒక చెంచా
- కొబ్బరి తురుము – అరకప్పు
- ఉల్లిపాయ – ఒకటి పెద్దది
- పసుపు – అర చెంచా
- నూనె – టేబుల్స్పూను
- ఆవాలు – అర చెంచా
- ఉప్పు – తగినంత
- కరివేపాకు రెబ్బలు – రెండు
- కొత్తిమీర – తగినంత

తయారు చేసే విధానం: ముందుగా మునక్కాయ ముక్కల్ని పసుపునీళ్లల్లో ఉడికించుకుని తీసుకోవాలి. స్టౌ మీద కడాయి పెట్టి ఎండుమిర్చి,(red Chilli,) దనియాలు, మెంతులు, మినప్పప్పు, మిరియాలు, కొంచెం జీలకర్ర వేసి నూనె లేకుండా వేయించి తీసుకోవాలి. ఈ దినుసులు కొబ్బరి తురుము, చింతపండు గుజ్జు, ఉల్లిపాయ(onion) ముక్కలు, మిక్సీలో వేసి మెత్తగా చేసుకుని పెట్టుకోవాలి. బాణలిని స్టౌ మీద పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వేయించి చేసి పెట్టుకున్న మసాలా వేయాలి. అది వేగుతున్నప్పుడు కాసిన్ని నీళ్లు, మునక్కాయ ముక్కలు వేసి బాగా కలపాలి. కూర ఉడుకుతున్నప్పుడు తగినంత ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి ఓసారి కలిపి అయిదు నిమిషాల తరువాత దింపాలి.

Read also:hindi.vaartha.com