हिन्दी | Epaper
వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు

Multigrain Drink :చిరుధాన్యాలతో విభిన్న రుచులు

Hema
Multigrain Drink :చిరుధాన్యాలతో విభిన్న రుచులు

Multigrain Drink:మల్టీగ్రెయిన్ డ్రింక్ తో ఆరోగ్య భద్రత-చిన్న పని చేసినా అలసట, ఎంత తిన్నా నీరసం, ఒంట్లో శక్తి లేకపోవడం లాంటి సమస్యలు కరోనా తరువాత తరచుగా వింటున్నాం. శరీరంలోకి వైరస్ ప్రవేశించిన తరువాత అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తడం సహజం. అయితే తిరిగి జీవశక్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గం.

అందుకు చిరుధాన్యాలు ఎంతో తోడ్పడతాయి. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, అరికెలతో పాటు పలు రకాల గింజలను కలిపి తయారు చేసిందే మల్టీగ్రెయిన్ డ్రింక్ మిక్స్. మార్కెట్లో అనేక ఆహార ఉత్పత్తి సంస్థలు వీటిని విక్రయిస్తున్నాయి.

 Multigrain Drink

పాలుతో కలిపి తాగదగిన ఆరోగ్యపూరిత: multigrain mix

ఉదయంపూట పాలు, గోరువెచ్చటి నీళ్లలో కలుపుకొని తాగవచ్చు. లేదంటే పాయసంలా చేసుకుని తినొచ్చు. గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులకు సులభంగా జీర్ణం అవుతుంది. ఇందులోని సూక్ష్మపోషకాలు, విటమిన్లు(Vitamins),ఖనిజాలు, ప్రొటీన్లు(proteins), పీచుపదార్థం, మంచికొవ్వు మొదలైనవి ఈ డ్రింక్ ద్వారా అందుతాయి

ఉదయం అల్పాహారంగా తీసుకోవచ్చు. మల్టీగ్రెయిన్ డ్రింక్ మిక్స్ తో రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. రోజువారీ ఆహారంలో ఇలా చిరుధాన్యాలను తీసుకున్న సంతృప్తి కూడా దక్కుతుంది. కాఫీ, టీలకు ప్రత్యామ్నాయంగా అలవాటు చేసుకుంటే మరీ మంచిది.

రాగిముద్ద

ఇడ్లీ, దోశలలోకి ‘మిక్స్’లు వచ్చినట్లు ఇప్పుడు రాగిముద్దలోకీ చిరుధాన్యాల పిండి వచ్చి చేరింది. రాగిపిండితో చేసిన ముద్దనే తినాలి అనేవాళ్లకు కొంత మింగుడు పడకపోవచ్చు. కానీ మిల్లెట్స్ ముద్దలు ఆకట్టుకుంటున్నాయి. దక్షిణ భారతదేశంలో రాగులతో ముద్ద, రొట్టె, జావ చేసుకోవడం అనాదిగా వస్తోంది. కన్నడలో రాగి, హిందీలో మండువా, మరాఠీలో నాచ్ని, తెలుగులో రాగిగా ప్రసిద్ధి చెందిందీ పంట. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రాగిముద్దను ఇష్టంగా తింటారు. రాగుల్లో పాలలో కంటే అధికంగా కాల్షియం, ప్రొటీన్లు ఉన్నాయి. పొటాషియం, ఫైబర్
అధికంగా ఉంటాయి.
మిగిలిన ధాన్యాలతో పోలిస్తే రాగులతో ముద్ద చేసుకోవడానికి ఖర్చు తక్కువ.
అయితే రాగుల్లో కంటే మిగిలిన చిరుధాన్యాలలో ఇతర పోషక విలువలు అదనం. మిల్లెట్స్ తో

రాగిముద్దకు అనుకూలమైన ముద్ద ‘మిక్స్’ పిండిని తయారు చేసి అమ్ముతున్నాయి ఆహార సంస్థలు. ముప్పావు శాతం రాగిపిండిలోకి ఈ మిక్స్‌ను కలిపి ముద్ద చేసుకుని తింటే సంపూర్ణ పోషక విలువలు అందుతాయని నిపుణులు అంటున్నారు.

స్వీట్ మిక్స్


దుకాణాల్లో రెడీమెడ్ లభించే మిఠాయిల్లో అత్యధిక పంచదార, నెయ్యి, కొవ్వులు, పాల ఉత్పత్తులు వాడతారు. ఈ మిఠాయిలను మితంగా తింటే పరవాలేదు. కానీ అతిగా తింటే అనారోగ్యం కొనితెచ్చుకున్నట్లే. అయితే ఇంట్లో బయట దొరికే స్వీట్లను తయారు చేసుకోవడం కష్టమంటే చిరుధాన్యాలతో చేసే స్వీట్స్ మరీ కష్టం.

ఆ ఇబ్బందిని తొలగించేందుకు మల్టీగ్రెయిన్ స్వీట్ మిక్స్ పౌడర్, రాగి, జొన్న, గోధుమ, బియ్యం, పప్పుదినుసులు, గింజలతో తయారైన ఈ పిండితో హల్వా లాంటి స్వీట్సు తయారు చేయవచ్చు. ఇందులో పంచదార శాతం తక్కువగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు, అవసరమైనంత మేరకు పంచదార, నెయ్యి మొదలైనవి కలుపుకోవచ్చు.

పాస్తా


ఒక్కో దేశంలో ఒక్కో రకం ఆహారం ప్రత్యేకంగా కనిపిస్తుంది. కానీ ప్రపంచమంతా పాస్తా దొరుకుతుంది. ఇది అత్యంత ప్రాచీనమైంది. పాస్తాను ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు సేమ్యాలా సులభంగా వండుకోవచ్చు. ఆ సౌలభ్యంతోనే పాస్తాను ఎక్కువ మంది తినడానికి ఇష్టపడతారు. అయితే సాధారణ పాస్తా కంటే చిరుధాన్యాలతో చేసిన ‘మల్టీగ్రెయిన్ పాస్తా’లో 5 శాతం అధికంగా పోషక విలువలు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, బీ విటమిన్స్, ఐరన్ వంటివన్నీ లభిస్తాయి. తక్కువ సోడియంతో పాటు అమినో యాసిడ్స్, కొవ్వులు మితంగా ఉంటాయి. సాధారణ పాస్తా అత్యంత త్వరగా జీర్ణమై గ్లూకోజ్‌గా మారే అవకాశం ఉంది. చిరుధాన్యాలతో చేసిన పాస్తా అయితే మెల్లగా జీర్ణం అవుతుంది. ఒక్కసారి తింటే వెంటనే ఆకలి వెయ్యదు. ధాన్యాల్లోని పీచుపదార్థం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఉదయం అల్పాహారంతో పాటు బయటకు వెళ్లినప్పుడు పాస్తాను తీసుకెళ్లవచ్చు. చిరుధాన్యాలతో తయారైన పాస్తాలు కూడా కొన్ని ప్రత్యేక ఫ్లేవర్స్‌లో లభిస్తున్నాయి. పిల్లలు ఇలాంటి పాస్తా తింటే మల్టీగ్రెయిన్ ఫుడ్ తిన్నట్లే కనుక ఆరోగ్యానికి మంచిది.

కుకీస్


బేకరీ ఉత్పత్తుల్లో కుకీస్‌ను ఎక్కువ మంది ఇష్టపడతారు. వీటి తయారీకి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాడే ధాన్యం గోధుమ, రకరకాల కుకీస్ మార్కెట్లో లభిస్తున్నాయి ఇప్పుడు. గోధుమపిండి, గుడ్లు, పంచదార, కొవ్వులు కలిపి చేస్తారు వీటిని.

కొన్నింటిలో ఎండుద్రాక్ష, బాదాం, జీడిపప్పు, చాకొలెట్ చిప్స్, ఓట్స్ వాటిని కుకీస్ పైన అలంకరణ కోసం వాడతారు. ఈ విధంగా చేయడం వల్ల రుచి కూడా రెట్టింపు అవుతుంది. చిరుధాన్యాల విప్లవం మొదలయ్యాక ఆహార ఉత్పత్తుల రేపురేఖలు మారిపోయాయి. బేక్ ఐటమ్స్‌లోనూ ఆ మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

బ్రెడ్, బన్, పిజ్జా, బర్గర్‌లోనూ ఏదో ఒక రకంగా చిరుధాన్యాలను ఉపయోగిస్తున్నారు. అయితే కుకీస్‌లో మిల్లెట్సన్ను మరింత ఎక్కువగా ఉపయోగించేందుకు వీలుంది. గోధుమపిండితో కాకుండా జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు తదితర ధాన్యాలతో కుకీస్‌ను తయారు చేస్తున్నాయి

జొన్న ప్లేక్స్

జొన్నలు చేసే మేలు గురించి మన పూర్వీకులు చెప్పారు. జొన్నరొట్టెలు, జొన్నసంకటి తెలుగువాళ్ల జీవితంలో భాగం. కొందరికి గోధుమరొట్టెలు గ్లూటెన్ అలర్జీ కలిగిస్తాయి. జొన్నరొట్టెలతో ఆ ఇబ్బంది ఉండదు. ఇందులోని అత్యధిక పీచుపదార్థం జీర్ణప్రక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. జొన్నల్లో కేన్సర్ కారకాలను నిరోధించే శక్తితో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఔషధ లక్షణాలు ఉన్నాయి. రక్తసరఫరా సాఫీగా సాగేలా చేసి, ఎముకలను దృఢంగా ఉంచుతుందీ ధాన్యం

జొన్నపిండికి సాగే గుణం లేదు కనుక రొట్టెలు చేయడం కష్టం. అందుకే అందరూ గోధుమ వైపు వెళ్లారు. ఆధునిక పరిజ్ఞానంతో కొత్త తరాన్ని ఆకట్టుకునేందుకు జొన్నలతో రకరకాల పదార్థాలను తయారు చేస్తున్నాయి కంపెనీలు. అందులో ఒకటి జొన్న ప్లేక్స్. ఇవి అటుకుల మాదిరి ఉంటాయి. జొన్న ముతక ధాన్యం కనుక దంచడం ద్వారా అటుకులు చేయలేరు. ప్రత్యేక యంత్రాలతో వీటిని చేస్తున్నారు. జొన్న ప్లేక్స్ తో ఉప్మా, పొంగల్, పాయసం, టొమాటో బాత్ వంటివి తయారు చేసుకోవచ్చు. జొన్నరొట్టెలను తినడానికి ఇష్టపడని వారికి ప్లేక్స్ ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు.

Read also:hindi.vaartha.com

Read also: Delicious Curry with Green Gram :పెసలతో రుచికరమైన కూర

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870