Mango Papaya Salad: కావలసిన పదార్థాలు
- సన్నగా తరిగిన మామిడి పండు ముక్కలు – ఒక కప్పు
- బొప్పాయి పండు ముక్కలు – ఒక కప్పు
- పచ్చిమిర్చి – రెండు
- కొత్తిమీర తురుము – ఒక టీస్పూన్
- వేయించిన పల్లీలు – పావు కప్పు
- ఉప్పు – తగినంత
- ఆలివ్ ఆయిల్ – రెండు టీస్పూన్లు
- మిరియాల పొడి – పావు టీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు – నాలుగు
- తెల్ల నువ్వులు – రెండు టీస్పూన్లు

తయారు చేసే విధానం
Mango Papaya Salad: ఒక గిన్నెలో మామిడి, బొప్పాయి ముక్కల్ని వేసి, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, వేయించిన పల్లీలు, తగినంత ఉప్పు, ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి, తురిమిన వెల్లుల్లి వేసి బాగా కలపాలి. చివరగా నువ్వులు వేసి మరోసారి కలుపుకొంటే నోరూరించే మామిడి-బొప్పాయి సలాడ్ సిద్ధం.

Read also: hindi.vaartha.com
Read also: Banana Kabab:బనానా కబాబ్