కావాల్సిన పదార్థాలు:
- బియ్యపు పిండి – 1 గ్లాసు
- కొబ్బరికోరు – 2 కప్పులు
- తరిగిన బెల్లం – 1 లేదా 2 కప్పులు
- ఏలకుల పొడి – 1 స్పూను
- నెయ్యి – కొద్దిగా
- ఉప్పు – చిటికెడు

తయారీ విధానం
ముందుగా ఒక బాణలిలో రెండు గ్లాసుల నీరు పోసి స్టౌ మీద మరిగించాలి. మరిగిన నీటిలో చిటికెడు ఉప్పు వేసి బియ్యపు పిండిని వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఆ తరువాత కొంచెం నెయ్యి వేసి దగ్గరికి అయ్యాక స్టౌ ఆపేసి మూత పెట్టాలి. మరో బాణలిలో కప్పు నీరు పోసి, తరిగిన బెల్లం (jaggery) వేసి కరిగించాలి. బెల్లం నీటిలో కొబ్బరి (coconut) తురుము వేసి ముద్దలా అయ్యే వరకు కలిపి, చివరగా ఏలకుల పొడి వేసి దింపాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత సిద్ధమైన పిండిని దొండకాయ ఆకారంలో ఒత్తుకుని మధ్యలో కొబ్బరి–బెల్లం ముద్దను చిన్న ఉండలా పెట్టి మూసి పొడుగ్గా చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని కజ్జికాయలు తయారుచేసుకుని ఇడ్లీ రేకులపై అమర్చుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి.

Read also: hindi.vaartha.com
Read also: