Coconut Pulihora: కావలసిన పదార్థాలు
- సెనగపప్పు – ఒక చెంచా
- అన్నం – రెండు కప్పులు
- నూనె – పావు కప్పు
- ఆవాలు –అర చెంచా
- మినప్పప్పు – చెంచా
- పల్లీలు – పావు కప్పు
- ఇంగువ – పావు చెంచా
- పసుపు – కొద్దిగా
- కరివేపాకు రెబ్బలు – నాలుగు
- ఎండుమిర్చి – మూడు
- కొబ్బరి తురుము – ఒక కప్పు
- నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత
- పచ్చిమిర్చి – మూడు
- జీలకర్ర – చెంచా
- బెల్లం – చిన్న ముక్క
- కొత్తిమీర తరుగు – పావు కప్పు
- ఉప్పు – తగినంత

తయారు చేసే విధానం
ముందుగా కొబ్బరి (coconut) తురుము, నానబెట్టుకున్న చింతపండు, పచ్చిమిర్చి, జీలకర్ర, బెల్లం, కొత్తిమీర తరుగు, సగం కరివేపాకు, తగినంత ఉప్పును మిక్సీలో వేసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి నూనె (oil) వేయాలి. అది వేడెక్కాక ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఇంగువ, ఎండుమిర్చి వేసి అన్నింటిని చక్కగా వేయించాలి. ఈ తాలింపు వేగాక పసుపు, మిగిలిన కరివేపాకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. పోపు వేడిగా ఉన్నప్పుడే ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని కడాయిలో వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి. చివరగా ఈ మిశ్రమం మొత్తాన్ని అన్నం పైన వేసి బాగా కలపాలి.

Read also: hindi.vaartha.com
Read also: