Coconut Jaggery Sweet: కావలసినవి:
అటుకులు – 2 కప్పులు, కొబ్బరి తురుము – 1 కప్పు
బెల్లం – పావు కిలో, నెయ్యి – 1 కప్పు, యాలకుల పొడి – అర చెంచా
నువ్వులు – అరకప్పు, జీడిపప్పు – అర కప్పు, కిస్మిస్ – అర కప్పు

తయారీ విధానం:
జీడిపప్పు, కిస్మిస్ నేతిలో వేయించాలి. బెల్లం పాకం పట్టి.. అందులో కొబ్బరి (coconut) తురుము, జీడిపప్పు, కిస్మిస్ వేయాలి. కాస్త ఉడకనిచ్చి, అటుకులు, మిగిలిన నెయ్యి (ghee) వేయాలి. రెండు నిమిషాలు సన్న సెగ మీద ఉంచి, కలియతిప్పి, దించితే సరి, అటుకులు కొబ్బరి బెల్లంతో రుచికరమైన కొబ్బరి మిఠాయి తయారవుతుంది.

Read also: hindi.vaartha.com
Read also: