కావాల్సినవి:
బెల్లం తురుము – కప్పు
ఊదలు – పావు కప్పు
కొర్రలు – పావు కప్పు
అవిసెగింజలు – చెంచా
బాదం పప్పులు – చెంచా
తెల్లనువ్వులు – చెంచా
గుమ్మడిగింజలు – చెంచా
నెయ్యి – రెండు చెంచాలు
యాలకుల పొడి – పావు చెంచా

తయారీ:
ఒక పాన్లో ఊదలు, కొర్రలని విడివిడిగా డ్రైరోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అవిసెగింజలు, బాదం పప్పులు,(Almonds) నువ్వులను కూడా వేర్వేరుగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్లో బెల్లం తురుము వేసి అందులో చెంచా నెయ్యి, రెండు మూడు చెంచాల నీళ్లు వేసి ఐదారు నిమిషాలు బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం (jaggery) చిక్కీ చేయడానికి వీలుగా మారిన తర్వాత అందులో వేయించి పెట్టుకున్న చిరుధాన్యాలు, పప్పులను కూడా వేసి బాగా కలపాలి. వెంటనే నెయ్యి రాసిన పళ్లెంలోకి తీసుకుని ముక్కలుగా కోసుకోవాలి. పోషకభరతమైన చిరుధాన్యాల చిక్కీ సిద్ధం.

Read also: hindi.vaartha.com
Read also: