కావలసిన పదార్థాలు:
- కాకరకాయలు – 4
- శనగపిండి – 2 టేబుల్ స్పూన్లు
- మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు
- బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు
- ఆమ్ చూర్ పౌడర్ – 1 చెంచా
- పసుపు – 1 చెంచా
- కారం – 1 ½ చెంచా
- ఉప్పు – తగినంత
- నూనె – వేయించడానికి సరిపడా

తయారు చేసే విధానం:
ముందుగా కాకరకాయలను కడిగి, తడి లేకుండా ఆరబెట్టాలి. తర్వాత వాటిని గుండ్రంగా లేదా నిలువుగా అన్నీ సమానంగా ఉండేలా ముక్కలుగా కోయాలి. శనగపిండి, మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, కారం, ఆమ్ చూర్ పౌడర్, పసుపు, ఉప్పు(salt) అన్నింటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. తర్వాత కాకరకాయ ముక్కలను ఈ మిశ్రమంతో మెల్లగా కలిపి పిండాలి. చాలా గట్టిగా కలిపితే ముక్కలు మెత్తబడి పోవచ్చు కాబట్టి జాగ్రత్తగా కలపాలి.
ఇప్పుడు కడాయిలో నూనె(oil)వేసి కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో కాకరకాయ ముక్కలను దోరగా వేయించాలి. అవి బంగారు రంగులోకి వచ్చి కరకరలాడేలా అవ్వగానే తీసేయాలి.ఇలా రుచికరమైన చేదు తీపి కలగలిపిన కాకరకాయ చిప్స్ రెడీ.

Read also:hindi.vaartha.com
Read also:Banana Chips:అరటి చిప్స్