Vamsi was arrested for kidnapping a Dalit .. Lokesh

దళితుడ్ని కిడ్నాప్ చేసినందుకు వంశీని అరెస్ట్ చేశారు : లోకేశ్

ప్రజా సమస్యలపై పోరాడిన తమపై అక్రమ కేసులు

అమరావతి: తప్పు చేసిన వైసీపీ నేతలను చట్టపరంగా శిక్షిస్తామన్నారు. 2019-24 మధ్య కొనసాగిన అరాచకపాలన అందరూ చూశారన్నారు. ప్రజా సమస్యలపై పోరాడిన తమపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. అక్రమాలను నిలదీస్తే టీడీపీ ఆఫీస్ పై దాడి చేశారన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గన్నవరం ఎమ్మెల్యేగా విజయం సాధించిన వల్లభనేని వంశీ.. ఎలక్షన్ తర్వాత వైసీపీకి మద్దతు ప్రకటించారు. అయితే.. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులోనూ వంశీ నిందితుడిగా ఉన్నారు.

Advertisements
దళితుడ్ని కిడ్నాప్ చేసినందుకు వంశీని

లోకేష్‌ హిట్‌ లిస్టులో కొడాలి నాని

ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వంశీ అరెస్ట్ ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. ఇటీవల దళిత యువకుడి కిడ్నాప్ కేసులో ఏపీ పోలీసులు వంశీని అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ అరెస్టుతో ఏపీ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ చర్చ సాగుతోంది. ఆ తర్వాతి అరెస్టు ఎవరన్న అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఇందులో మాజీ మంత్రి కొడాలి నాని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. లోకేష్‌ హిట్‌ లిస్టులో కొడాలి నాని ఉన్న విషయం తెలిసిందే.

వంశీ అరెస్టు తర్వాత అలర్ట్ అయ్యి నాని

కొడాలి నానిని విడిచి పెట్టేది లేదంటూ ఎన్నకల ప్రచార సమయంలో లోకేష్ అనేక సార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటమి తర్వాత కొడాలి నాని హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. అడపాదడపా మినహా పార్టీ కార్యక్రమాల్లోనూ నాని కనిపించడం లేదు. వంశీ అరెస్టు తర్వాత అలర్ట్ అయ్యి నాని అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయారంటూ చర్చ సాగుతోంది.

Related Posts
బీజేపీ మ్యానిఫెస్టోలోనూ ‘ఆప్’ పథకాలే – కేజీవాల్
ఎన్నికల ఓటమి తర్వాత ఆప్‌లో తాజా పరిణామాలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రకటించిన మ్యానిఫెస్టోపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు అరవింద్ కేజీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ప్రతిపాదించిన Read more

సానియా సమాధానంతో పగలబడి నవ్విన అభిమానులు
సానియా సమాధానంతో పగలబడి నవ్విన అభిమానులు – వైరల్ వీడియో

భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా గురించి ఎప్పుడూ వార్తల్లో నిలిచే అంశాలు కొన్ని ఉంటాయి. ఆమె ఆటలో సాధించిన విజయాలు, వ్యక్తిగత జీవితం, సోషల్ మీడియాలో Read more

ఆర్థిక సవాళ్లు ఉన్నా సంక్షేమ పథకాలకే ప్రాధాన్యం: చంద్రబాబు
ఆర్థిక సవాళ్లు ఉన్నా సంక్షేమ పథకాలకే ప్రాధాన్యం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ గత పరిపాలన నుండి వచ్చిన తీవ్రమైన సవాళ్లను నొక్కిచెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో Read more

దేశప్రజలకు మోడీ శుభాకాంక్షలు
దేశప్రజలకు మోడీ శుభాకాంక్షలు

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి ఆసక్తి ఉన్న భారతదేశం యొక్క మానసిక స్థితిని ప్రతిబింబిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం X లో ఒక పోస్ట్‌లో దేశప్రజలకు నూతన Read more

×