కృష్ణలంక పీఎస్ లో వంశీని విచారించిన పోలీసులు
అమరావతి: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసు కస్టడీ ముగిసింది. మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో కృష్ణలంక పీఎస్‌లో పటమట పోలీసులు ఆయన్ను విచారించిన విషయం తెలిసిందే. చివరి రోజు విచారణ ముగిసిన అనంతరం వంశీని విజయవాడ జీజీహెచ్‌కు తరలించి వైద్యపరీక్షలు చేయించారు.

వంశీతో పాటు లక్ష్మీపతి, శివరామకృష్ణను విచారించిన పోలీసులు
కస్టడీలో వంశీతో పాటు మరో ఇద్దరు నిందితులు లక్ష్మీపతి, శివరామకృష్ణను పోలీసులు విచారించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రమేయం ఉన్నవారిపై ఆరా తీశారు. వంశీ చెబితేనే సత్యవర్ధన్‌ను తీసుకెళ్లినట్లు మిగతా నిందితులు చెప్పినట్లు సమాచారం. తనకేమీ తెలియదని పోలీసుల విచారణలో వంశీ పదేపదే చెప్పినట్లు తెలిసింది. దీంతో మరోసారి ఆయన్ను కస్టడీకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు.
వంశీ..తెలియదు..గుర్తు లేదు అనే సమాధానాలు
ఇలాగే సత్యవర్ధన్ ను విశాఖలో ఓ దుకాణానికి తీసుకెళ్లి దుస్తులు కొనిచ్చారు. ఆయన దృశ్యాలను వైసీపీ సోషల్ మీడియా విడుదల చేసింది. ఆయనను కిడ్నాప్ చేయలేదని స్వచ్చగా దుస్తులు కొనుక్కుంటున్నారని ప్రకటించింది. అయితే ఆయనకు రెండు వైపులా వంశీ అనుచరులు అయిన రౌడీషీటర్లు ఉన్నారు. అంటే వారి అదుపులోనే సత్యవర్ధన్ ఉన్నారని పోలీసులకు స్ఫష్టత వచ్చిందని చెబుతున్నారు. మూడు రోజుల కస్టడీలో చాలా విషయాలకు వంశీ..తెలియదు..గుర్తు లేదు అనే మాధానాన్నే చెప్పినట్లుగా తెలుస్తోంది.