vallabhaneni vamsi three day custody has ended

ముగిసిన వంశీ మూడు రోజుల కస్టడీ విచారణ

కృష్ణలంక పీఎస్ లో వంశీని విచారించిన పోలీసులు

అమరావతి: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసు కస్టడీ ముగిసింది. మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో కృష్ణలంక పీఎస్‌లో పటమట పోలీసులు ఆయన్ను విచారించిన విషయం తెలిసిందే. చివరి రోజు విచారణ ముగిసిన అనంతరం వంశీని విజయవాడ జీజీహెచ్‌కు తరలించి వైద్యపరీక్షలు చేయించారు.

Advertisements
ముగిసిన వంశీ మూడు రోజుల

వంశీతో పాటు లక్ష్మీపతి, శివరామకృష్ణను విచారించిన పోలీసులు

కస్టడీలో వంశీతో పాటు మరో ఇద్దరు నిందితులు లక్ష్మీపతి, శివరామకృష్ణను పోలీసులు విచారించారు. సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో ప్రమేయం ఉన్నవారిపై ఆరా తీశారు. వంశీ చెబితేనే సత్యవర్ధన్‌ను తీసుకెళ్లినట్లు మిగతా నిందితులు చెప్పినట్లు సమాచారం. తనకేమీ తెలియదని పోలీసుల విచారణలో వంశీ పదేపదే చెప్పినట్లు తెలిసింది. దీంతో మరోసారి ఆయన్ను కస్టడీకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు.

వంశీ..తెలియదు..గుర్తు లేదు అనే సమాధానాలు

ఇలాగే సత్యవర్ధన్ ను విశాఖలో ఓ దుకాణానికి తీసుకెళ్లి దుస్తులు కొనిచ్చారు. ఆయన దృశ్యాలను వైసీపీ సోషల్ మీడియా విడుదల చేసింది. ఆయనను కిడ్నాప్ చేయలేదని స్వచ్చగా దుస్తులు కొనుక్కుంటున్నారని ప్రకటించింది. అయితే ఆయనకు రెండు వైపులా వంశీ అనుచరులు అయిన రౌడీషీటర్లు ఉన్నారు. అంటే వారి అదుపులోనే సత్యవర్ధన్ ఉన్నారని పోలీసులకు స్ఫష్టత వచ్చిందని చెబుతున్నారు. మూడు రోజుల కస్టడీలో చాలా విషయాలకు వంశీ..తెలియదు..గుర్తు లేదు అనే మాధానాన్నే చెప్పినట్లుగా తెలుస్తోంది.

Related Posts
బర్డ్ ఫ్లూ పై మితిమీరిన భయాలు వద్దు: అచ్చెన్నాయుడు
బర్డ్ ఫ్లూ పై మితిమీరిన భయాలు వద్దు: అచ్చెన్నాయుడు

ఏపీలో ఇప్పుడు చికెన్ పేరు చెబితేనే జనం భయపడుతున్నారు. గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ సోకి లక్షలాది కోళ్లు చనిపోతున్న నేపథ్యంలో చికెన్ తినాలంటే ఆలోచిస్తున్నారు. అంతే Read more

ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు ఎప్పుడంటే

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి కౌంట్‌డౌన్ మొదలైంది ఈ టోర్నమెంట్ ప్రారంభానికి కేవలం కొన్ని రోజులు మిగిలి ఉన్నాయి "మినీ వరల్డ్ కప్"గా పిలిచే ఈ Read more

సీఎం రేవంత్ రెడ్డి ని ఇరకాటంలో పడేసిన కుమారి ఆంటీ
kumari aunty

ఈ రోజు సోషల్ మీడియా వాడకం వలన చాలా విషయాలు ప్రజల దృష్టికి వస్తున్నాయి. వాటిలో కొన్నింటికి చాలా పెద్దగా గుర్తింపు కూడా వస్తోంది. ఇటీవల కుమారీ Read more

CLP Meeting : నేడు కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం
revanth clp

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం నేడు ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. ప్రభుత్వ పథకాల Read more

×