అమరావతి: గన్నరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో దళితుడిని కిడ్నాప్చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం విజయవాడ సబ్‌జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ ను కోర్టు ఈ నెల 17 వరకు పొడిగించింది. ఈ కేసులో సీఐడీ పోలీసులు పీటీ వారెంటును దాఖలు చేశారు. ఇదే కేసులో జైలు నుంచి వంశీని వర్చువల్ గా కోర్టులో ప్రవేశపెట్టారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ఏ71 గా ఉన్న విషయం తెలిసిందే.

రిమాండ్‌లో ఉండగానే ఆయనపై పీటీ
ఆయన గత నెల 11వ తేదీన హైదరాబాద్‌లో అరెస్టు అయ్యారు. పోలీసులు వంశీని కస్టడీకి కోరగా మూడురోజులు అనుమతించింది. ఆయనను మూడురోజులపాటు కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వెళ్లి విచారణ జరిపారు. రిమాండ్‌లో ఉండగానే ఆయనపై పీటీ వారెంట్లు జారీ అయ్యాయి. హైకోర్టు కూడా ఆయన బెయిలు పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా, బ్యారక్ మార్చాలంటూ వంశీ కోర్టులో పిటిషన్ వేయగా.. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
మూడు రోజుల పాటు వంశీని పోలీసులు కస్టడీ
అలాగే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసింది. అయితే గతంలోనే దీనిపై విచారణ జరగాల్సి ఉండగా మూడు రోజుల పాటు వంశీని పోలీసులు కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో ఈ పిటిషన్‌ను సీఐడీ వెనక్కి తీసుకుంది. ఇప్పుడు తిరిగి సీఐడీ పిటిషన్ దాఖలు చేయడంతో ఈరోజు వర్చువల్‌గా వంశీని కోర్టులో హాజరుపర్చగా.. న్యాయాధికారి ఈనెల 17 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు చేశారు. అలాగే వంశీతో పాటు మరో ఇద్దరిని పోలీసులు మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు