Vallabhaneni Vamsi remanded until the 17th of this month

ఈ నెల 17 వరకు వల్లభనేని వంశీకి రిమాండ్

అమరావతి: గన్నరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో దళితుడిని కిడ్నాప్​చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం విజయవాడ సబ్​జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ ​ను కోర్టు ఈ నెల 17 వరకు పొడిగించింది. ఈ కేసులో సీఐడీ పోలీసులు పీటీ వారెంటును దాఖలు చేశారు. ఇదే కేసులో జైలు నుంచి వంశీని వర్చువల్ గా కోర్టులో ప్రవేశపెట్టారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ఏ71 గా ఉన్న విషయం తెలిసిందే.

Advertisements
ఈ నెల 17 వరకు వల్లభనేని వంశీకి

రిమాండ్​లో ఉండగానే ఆయనపై పీటీ

ఆయన గత నెల 11వ తేదీన హైదరాబాద్​లో అరెస్టు అయ్యారు. పోలీసులు వంశీని కస్టడీకి కోరగా మూడురోజులు అనుమతించింది. ఆయనను మూడురోజులపాటు కృష్ణలంక పోలీస్​స్టేషన్​కు తీసుకు వెళ్లి విచారణ జరిపారు. రిమాండ్​లో ఉండగానే ఆయనపై పీటీ వారెంట్లు జారీ అయ్యాయి. హైకోర్టు కూడా ఆయన బెయిలు పిటిషన్​ను కొట్టివేసింది. కాగా, బ్యారక్‌ మార్చాలంటూ వంశీ కోర్టులో పిటిషన్ వేయగా.. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

మూడు రోజుల పాటు వంశీని పోలీసులు కస్టడీ

అలాగే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసింది. అయితే గతంలోనే దీనిపై విచారణ జరగాల్సి ఉండగా మూడు రోజుల పాటు వంశీని పోలీసులు కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో ఈ పిటిషన్‌ను సీఐడీ వెనక్కి తీసుకుంది. ఇప్పుడు తిరిగి సీఐడీ పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈరోజు వర్చువల్‌గా వంశీని కోర్టులో హాజరుపర్చగా.. న్యాయాధికారి ఈనెల 17 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు చేశారు. అలాగే వంశీతో పాటు మరో ఇద్దరిని పోలీసులు మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు

Related Posts
‘గ్రూప్-2’ పరీక్షలో చంద్రబాబు , తెలంగాణ తల్లిపై ప్రశ్నలు
group2 exam

తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలో ప్రశ్నలు విభిన్నంగా వచ్చాయి. వీటిలో ముఖ్యంగా తెలంగాణ తల్లి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నిజాం సాగర్ వంటి అంశాలపై Read more

Posani krishna murali : పోసానికి లభించిన ఊరట
Posani krishna murali : పోసానికి లభించిన ఊరట

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట ల‌భించింది. గ‌తవారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని సూళ్లూరుపేట పోలీసులు పోసానిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోసాని Read more

Russia: విక్టరీ డే పరేడ్‌ వేడుకల్లో పాల్గొనాలని మోదీని ఆహ్వానించిన రష్యా
విక్టరీ డే పరేడ్‌ వేడుకల్లో పాల్గొనాలని మోదీని ఆహ్వానించిన రష్యా

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి రష్యా నుంచి మరోసారి ఆహ్వానం అందింది. మే 9న నిర్వహించే విక్టరీ డే పరేడ్‌ వేడుకల్లో పాల్గొనాలని మోదీకి క్రెమ్లిన్‌ Read more

YS Sharmila : 44 వేల ఎకరాలు కావాలట… చంద్రబాబుపై షర్మిల విమర్శలు
YS Sharmila 44 వేల ఎకరాలు కావాలట... చంద్రబాబుపై షర్మిల విమర్శలు

రాజధాని అమరావతి అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. ఈసారి ప్రశ్నల దాడికి దిగింది ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. గతంలో భూముల సేకరణకు సంబంధించి ఎంత ఉపయోగం Read more

×