Vallabhaneni Vamsi remanded until April 1

Gannavaram Court: ఏప్రిల్‌ 1 వరకు వల్లభనేని వంశీకి రిమాండ్‌

Gannavaram Court: గన్నవరం కోర్టులో వైసీపీనేత వల్లభనేని వంశీని పీటీ వారెంట్‌పై అరెస్ట్‌ చేసి హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఏప్రిల్‌ 1 వరకు వంశీకి రిమాండ్‌ విధించింది. అనంతరం గన్నవరం కోర్టు నుంచి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ప్రస్తుతం సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో అరెస్టై విజయవాడ జిల్లా జైల్లో వంశీ రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

Advertisements
image

ఆత్కూరు పోలీసులు కేసు నమోదు

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పీఎస్‌ పరిధిలో ఓ ముస్లిం మహిళకు చెందిన భూమిని ఆమె కుమారులని ఇద్దరు వ్యక్తులు రిజిస్ట్రేషన్‌ చేశారు. భూమిని కొనుగోలు చేసేందుకు తాను మహిళతో అగ్రిమెంట్‌ చేసుకున్నానని శ్రీధర్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా రాము, వల్లభనేని వంశీ, రంగా మరొకరిపై ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వంశీ ఏ2గా ఉన్నారు. గన్నవరం కోర్టులో ఆత్కూరు పోలీసులు ఇటీవల పీటీ వారెంట్‌ దాఖలు చేశారు. కోర్టు అనుమతించటంతో మంగళవారం విజయవాడ నుంచి గన్నవరం తీసుకెళ్లి కోర్టులో హాజరు పర్చారు.

ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో విచారణ

తనకు జైలులో ఇనుప మంచం ఇచ్చారని, పరుపు, ఫైబర్ కుర్చీ ఇచ్చేందుకు జైలు అధికారులను ఆదేశించాలని వంశీ న్యాయమూర్తిని కోరారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఈ అంశంపై విచారణ జరిగిన నేపథ్యంలో తాను వాటిపై ఆదేశాలివ్వలేనని గన్నవరం కోర్టు తెలిపింది. సంబంధిత కోర్టులోనే పరిష్కరించుకోవాలని వంశీకి సూచించింది. మెడికల్ రిపోర్టులు పొందుపరిస్తే వాటి ఆధారంగా ఫైబర్ కుర్చీ ఇచ్చే అంశంపై ఆదేశాలిస్తామని కోర్టు తెలిపింది. విచారణ అనంతరం వంశీని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

Related Posts
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్‌ అలర్ట్‌..ఎందుకంటే..!
shamshabad airport red aler

జనవరి 26న గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈనెల Read more

ఎమర్జెన్సీ సినిమా పై కంగనాపై నెగిటివ్ రియాక్షన్స్
ఎమర్జెన్సీ సినిమా పై కంగనాపై నెగిటివ్ రియాక్షన్స్

భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పద అంశంగా నిలిచిన ఎమర్జెన్సీని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్ రూపొందించిన చిత్రం "ఎమర్జెన్సీ". ఈ సినిమా విడుదలతో మరోసారి Read more

బీజేపీదే విజయమంటున్న మెజార్టీ ఎగ్జిట్ పోల్స్..!
Majority exit polls show that BJP is the winner.

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. రెండున్నర దశాబ్దాలకు పైగా అధికారానికి దూరంగా ఉన్న కాషాయ పార్టీ.. ఆమ్‌ఆద్మీకి గట్టి పోటీ ఇచ్చింది. మరోసారి అధికారాన్ని Read more

అమిత్‌ షాతో ఒమర్‌ అబ్దుల్లా భేటీ..
222

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా భేటి అయ్యారు. ఈ సమావేశంలో జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇచ్చే అంశంపై చర్చ జరిగింది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×