vastu for work:ప్రశ్న: మేం ఇల్లు పూర్తి కాకముందే గృహ ప్రవేశం చేసి ఇంట్లోకి వచ్చాకే చాలా భాగం పూర్తిచేసుకున్నాం. ఇప్పుడు మా ఇంటికి సంబంధించిన అన్ని నిర్మాణ పనులు పూర్తయ్యాయి. కానీ ముందు భాగం (దక్షిణ కాంపౌండ్ వాల్ నిర్మాణం మాత్రమే మిలిపోయింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిర్మాణం పూర్తి చేద్దామని ఎంత ప్రయత్నింనా వీలుకావడం లేదు. ఏ పనులు సక్ర
లేదు. మేం గృహ ప్రవేశంచేసి మూడు సంవత్స రాలు అవుతుంది.అప్పులు ఎంతమాత్రం తీరడంలేదు. పూర్తయ్యే మార్గాలు చాలా వున్నాయి. అయినా లోన్ సాంక్షన్ కాకపోవడం
వాటికి ఏవో అడ్డంకులు ఎదురుకావడం ఈ సమస్యలన్నీ వాస్తు లోపంవల్ల జరుగుతు
న్నాయా? మేం ఇల్లు మాత్రం పూర్తి వాస్తుతోనే నిర్మించాం.
జవాబు: గృహ నిర్మాణం పూర్తి కాకుండా గృహ ప్రవేశం చేయడం సరైన పద్ధతి కాదు. ఏవయినా చిన్న చిన్న పనులు మిగిలిపోయి వుంటే గృహ ప్రవేశం అనంతరం పూర్తి చేసుకోవచ్చు. కానీ మంచి ముహూర్తం మించిపోతుందని ముందు గృహ ప్రవేశం
చేసి తరువాత ఫ్లోర్ పనులు, తలుపులు బిగించటం మొదలయిన పనులు (works) చేయటం ఎంతోమంది విషయంలో చూస్తూ వుంటాను. మీలాగే ఏ పనులు సక్రమంగా జరగక ఆర్థిక, అనారోగ్య (sick)సమస్యలు ఎదుర్కోవలసి
వస్తుంది. మరొక విషయం ఏమిటంటే దక్షిణ సరిహద్దుపై మీరు కట్టవలసిన కాంపౌండ్
గోడ దక్షిణ నైరుతిని పెంచుతూ వుంది. ముందు నైరుతిని 90 డిగ్రీలకు సరిచేసుకుని
మిగతా స్థలాన్ని వదిలేసి లేదా కలుపుకొని దక్షిణ ప్రహరీగోడ నిర్మాణం చేయండి. అర్థాంతరంగా గృహ ప్రవేశం చేసినప్పుడునీ కలిగే దోష నివారణకు పద్ధతులు ఉంటాయి. వ్యక్తిగతంగా కలిసి
తెలుసుకోవచ్చు.
దక్షిణంలో ఖాళీ స్థలం ఉండవచ్చా?
ప్రశ్న: మా ఇంటి ప్లాను పంపిస్తున్నాను. మా ఇంటి వాస్తు పరిశీలించి తగిన సలహా ఇవ్వగలరు. ఎంత ప్రయత్నించినా పిల్లలకు పెళ్లి కావడం లేదు. దానికితోడు ఆర్థిక ఇబ్బందులు. షాపులో వ్యాపారం సక్రమంగా నడవడం లేదు. చాలా ఇబ్బంది వుంది. మనశ్శాంతి లేదు. మా ఇంటి వెనకాల 110 అడుగుల దక్షిణ ఖాళీ స్థలం వుంది. అందువల్లమాకు కష్టాలు వస్తున్నాయని కొంతమందిఅంటున్నారు. దక్షిణంలో ఖాళీ స్థలంవుండవచ్చాతెలుపగలరు.
జవాబు: దక్షిణంలోఅంత ఖాళీ స్థలం వుండకూడదు. నిజమే! నైరుతి మూలన 10×10 అడు
గుల షెడ్డు కానీ, గదినికానీ నిర్మించండి. దాని లోపలికి వెళ్లడానికి కనీసం ఒక అడుగు
(మెట్టు ఎక్కి వెళ్లేలా ఎత్తు వుండాలి. తప్పకుండా మెరుగయిన ఫలితాలు వుంటాయి.
దక్షిణ ఖాళీ స్థలం వల్ల ఎక్కువగా అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అధికంగానే
వుంటాయి. పైన చెప్పిన విధంగా చేయడంవల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. కానీవాయువ్యంలో వున్న ఇండిపెండెంట్ షాపును వేరు చేస్తూ ప్రహరీగోడను సవరించడం వల్ల మంచి ఫలితాలు మరింత మెరుగ్గా వుంటాయి.

ఒకే ఇంటికి రెండు
సింహద్వారాలు
ప్రశ్న: ఇప్పుడు ఉన్న పెంకు టిల్లుకు కప్పు రిపేరు చేయించినప్పుడు’వెన్నుదూలం’ జాయింటుగా వేయించడం జరిగింది. దానిని విడదీసి మా పోర్షన్ మేం పడగొట్టవచ్చా? ఒకే మేడను రెండు ఫ్లాట్స్అం టే తూర్పుకు ఒకటి, పడమరకు ఒకటి సంహద్వారాలు కట్టవచ్చా?
జవాబు: పెంకుటిల్లును పడగొట్టినప్పుడు వెన్ను’ విషయంలో చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. వెన్ను కోయటం’ వాస్తు పరంగా పెద్ద దోషం కిందే లెక్క. వెన్ను జాయింట్ నుండి
విడదీయటం కూడా దోషమే అయినప్పటికీ వెన్ను కోసినంత దోషం కాదు. ఆ వాటా వాళ్లతో
కూడా మాట్లాడి మొత్తం ఇంటిని విప్పేసి (వారి వాటా పన్నెండు అడుగులే కాబట్టి) తిరిగి (మీలాగే ఆర్.సి.సి) గృహ నిర్మాణాలు చేసుకోవటం మంచిది. ఒకే మేడను రెండు ఫ్లాట్స్ గా మీరు చెప్పిన
ముఖ ద్వారాలుంచి రెండు పోర్షన్లు కట్టవచ్చు. అయితే అందుకు ప్రత్యేక పద్ధతులు, ప్లాన్లు వుంటాయి. ఉమ్మడి గోడలు పెట్టి కట్టకూడదు. ఉమ్మడి గోడలు పెట్టి రెండు పోర్షన్లు కడితే ఒకవైపు వున్నవారికి మంచి ఫలితాలు, మరోవైపు వున్నవారికి అంత మంచి ఫలితాలు వుండవు. తూర్పు, ఉత్తర భాగాల్లో వుండేవారికి పడమర, దక్షిణ భాగాల్లో వుండేవారికంటే మంచి ఫలితాలు వుంటాయి. అందరికీ మంచి ఫలితాలుండటం మన అభిమతం కాబట్టి అటువంటి ఫలితాలనిచ్చే విధంగా
ప్లాన్ వేసి కట్టుకోవాలి.
Read also:hindi.vaartha.com
Read also: