నాగ దోషం పోవాలంటే ఏం చేయాలి?
ప్రశ్న: ఏ వ్యాపారం చేసినా, ఏ పనిని మొదలు పెట్టినా కలిసి రావడం లేదు. ఉద్యోగం కూడా లేదు. ప్రయత్నించిన ప్రతి పనికీ అన్ని ఆటంకాలే ఎదురవుతున్నాయి.
రెండు సార్లు నాగ సర్పాలను ఇంటి హాలులో, వరండా ఆవరణలో ఇతరుల చేత చంపించాం. దానికి శ్రీకాళహస్తీశ్వరాలయంలో యజ్ఞం చేయించాను. ప్రస్తుతం దక్షిణం వైపు ప్రహరీగోడ లేదు. ఏమైనా పూజలు చేయించమంటారా?
నాగ దోషం
సర్పాలను హింసించడం వలన, చంపడం వలన ‘నాగదోషం(naga dosham)’ కలుగుతుంది. నాగదోషాన్ని ఎవరూ విధంగానూ పూర్తిగా తీసివేయలేరు. నాగదోషం వలన సంక్రమించే ఫలితాలను కూడా అనుభవించక తప్పదు. ప్రత్యేకించి నాగదోషం వలన దారిద్ర్యం, గర్భస్రావాలు వంటి సమస్యలు ఎదురవుతుంటాయి.

ఏం చేయాలి?
ప్రహరీగోడలు వుండవలసిందే. మీరు దక్షిణంలో ఖాళీ స్థలం వదిలి, ఉత్తరం సరిహద్దు పైన గృహ నిర్మాణం గావించారు. ఇలా కట్టకూడదు. కుబేర స్థానం మూతపడటం వలన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
ప్రధాన ద్వారానికి ఎదురుగా పెరటి వైపు నీళ్ల సంపు ఉంది. ఉత్తరంలో ఖాళీ స్థలం వదులుతూ మార్పులు చేయాలి. సాంకేతిక పరంగా వీలయ్యేదీ, లేనిదీ — సివిల్ ఇంజినీరు మరియు వాస్తు నిపుణులతో సంప్రదించి మార్పుల విషయంలో ముందుకు సాగితే మంచిది.
సర్పాలను హింసించడం వలన, చంపడం వలన ‘నాగదోషం(naga dosham)’ కలుగుతుంది. నాగదోషాన్ని ఎవరూ విధంగానూ పూర్తిగా తీసివేయలేరు. నాగదోషం వలన సంక్రమించే ఫలితాలను కూడా అనుభవించక తప్పదు. ప్రత్యేకించి నాగదోషం వలన దారిద్ర్యం, గర్భస్రావాలు వంటి సమస్యలు ఎదురవుతుంటాయి.
అంగవైకల్య సంతానం, చర్మరోగాలు, తీవ్ర కోపం, తీవ్ర మానసిక ఆందోళన, వెన్నుపూస, నరాల సంబంధ వ్యాధులు మొదలైన చెడు ఫలితాలు పొందవలసిన అగత్యం కలుగుతుంది.
దోష తీవ్రతను తగ్గించుకోవడానికి కొన్ని సాధనాలు అవలంబించడం అవసరం. దోష తీవ్రత తగ్గినప్పుడు, చెడు ఫలితాల తీవ్రత కూడా తగ్గుతుంది.
పూజల కోసం శ్రీశైలం, శ్రీకాళహస్తి వెళ్లడం ఆనవాయితీగా ఉంది. విశేష శాంతి పూజలు మాత్రం అవశ్యం.
దోష నివారణకు కర్ణాటకలోని కుక్కె సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది. అక్కడ పిండితో సర్పాకృతిని తయారుచేసి, దానికి నాగదోష (naga dosham) బాధితులతో పిండప్రదానం, శాంతిపూజలు విశిష్ట రీతిలో చేయిస్తారు. ఎంతో మంది నాగదోష బాధితులు విశేష ఫలితాలు పొందినట్టు నమ్ముతారు. మీరు ప్రయత్నించవచ్చు.

‘కుబ్జవేధ’ అంటే ఏంటి?
- గృహం ఎత్తు (కప్పు) ఉండవలసిన ప్రమాణం కంటే తక్కువ ఎత్తును కలిగి వుంటే, ఆ గృహం ‘కుబ్జవేధ’ దోషాన్ని కలిగిస్తుంది.
- గృహం వైభవానికి (వైశాల్యం, ఎత్తు, వెడల్పు, పొడవు) తగిన రీతిలో ద్వారాలు, కిటికీలు ఉండాలి. అలాగాకుండా, ద్వారాలు, కిటికీలు తప్పుడు కొలతలతో వుంటే, ఆ గృహం ‘కుబ్జవేధ దోషం’ కలిగి ఉంటుంది.
‘కుబ్జకుష్టాది రోగం స్యాత్’ అంటే ఏంటి?
ఈ దోషం కలిగిన గృహంలో నివసించేవారికి — యజమానికి కుష్టు, క్షయ, ఉబ్బసం, పాండురోగం మొదలైన వ్యాధులు కలుగుతాయని పురాతన గ్రంథాలు వివరించాయి.