Ustad Zakir Hussain passed away

ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత

న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ (73)కన్నుమూశారు. హృద్రోగ సంబంధ సమస్యలతో రెండు వారాలుగా ఆయన అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చేర్చగా మరణించారని ఆయన స్నేహితుడు, ఫ్లూటిస్ట్‌ రాకేశ్‌ చౌరాసియా తెలిపారు. మరణించే సమయంలో హుస్సేన్‌ పెద్ద కుమారుడు, తబలా కళాకారుడు అల్లా రఖా తండ్రి వద్దే ఉన్నారు.

1999లో అమెరికా ఆయనకు నేషనల్‌ హెరిటేజ్‌ ఫెలోషిప్‌ ప్రదానం చేసినప్పుడు భారత శాస్త్రీయ సంగీతానికి ప్రపంచ రాయబారిగా గుర్తింపు పొందారు. అతను 1973లో ఇంగ్లిష్‌ గిటారిస్ట్‌ జాస్‌ మెక్‌లాగ్లిన్‌, వయోలిన్‌ వాద్యకారుడు ఎల్‌ శంకర్‌, పెర్కెషన్‌ వాద్యకారుడు టీహెచ్‌ విక్కు వినాయక్‌రామ్‌తో కలిసి చేసిన సంగీత ప్రాజెక్టు సంగీత ప్రియులను కొత్త లోకంలోకి తీసుకువెళ్లింది. జాకీర్‌ హుస్సేన్‌ నటుడు కూడా. ఆయన శశికపూర్‌తో ఒక హాలీవుడ్‌తో పాటు పలు బాలీవుడ్‌ చిత్రాలలో నటించారు.

కాగా, హుస్సేన్‌ మృతికి పలువురు సంగీతకారులు, నటులు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 1951లో ముంబయిలో జన్మించిన జాకీర్‌ తండ్రి ఉస్తాద్‌ అల్లా రఖా ఖాన్‌ కూడా ప్రముఖ తబలా సంగీతకారుడే. భారత శాస్త్రీయ సంగీతంలో జాకీర్‌ తనదైన ముద్ర వేశారు. తండ్రి వద్దనే సంగీతాన్ని అభ్యసించి ఏడేండ్ల వయసులోనే ఆయన కచేరీలలో తబలా వాయించే వారు. ముంబైలో గ్రాడ్యుయేషన్‌, జాకీర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ నుంచి సంగీతంలో డాక్టోరల్‌ డిగ్రీని పూర్తి చేశారు.

Related Posts
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ..పలు నిర్ణయాలకు ఆమోదం
AP Cabinet meeting concluded..Approval of many decisions

అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం లభించింది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇకపై 34 Read more

బంగ్లాదేశకు అమెరికా షాక్
USAID

బంగ్లాదేశ్ ఆర్థిక సంక్షోభంలో ఉన్న వేళ, అమెరికా దాతృత్వ సంస్థ యూఎస్ఏఐడీ (USAID) ఆ దేశానికి ఇచ్చే అన్ని రకాల సాయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం Read more

జగిత్యాల జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్..కొన్న 40 రోజులకే
electric bike explodes in j

తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు ఇస్తూ ప్రోత్సహిస్తుంటే..మరోపక్క ఎలక్ట్రిక్ బైక్లు పేలుతున్న ఘటనలు వాహనదారులకు షాక్ కలిగిస్తున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో కొన్న 40 రోజులకే Read more

ఎస్సీ రిజర్వేషన్లు: కమిషన్ సిఫారసులు ఇవే
reservation

తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి కొత్త మార్పులు ప్రతిపాదించబడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ కమిషన్ నివేదికపై ముఖ్యమైన వివరాలు వెల్లడించారు. తెలంగాణలో 15 శాతం Read more