Ustad Zakir Hussain passed away

ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత

న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ (73)కన్నుమూశారు. హృద్రోగ సంబంధ సమస్యలతో రెండు వారాలుగా ఆయన అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చేర్చగా మరణించారని ఆయన స్నేహితుడు, ఫ్లూటిస్ట్‌ రాకేశ్‌ చౌరాసియా తెలిపారు. మరణించే సమయంలో హుస్సేన్‌ పెద్ద కుమారుడు, తబలా కళాకారుడు అల్లా రఖా తండ్రి వద్దే ఉన్నారు.

1999లో అమెరికా ఆయనకు నేషనల్‌ హెరిటేజ్‌ ఫెలోషిప్‌ ప్రదానం చేసినప్పుడు భారత శాస్త్రీయ సంగీతానికి ప్రపంచ రాయబారిగా గుర్తింపు పొందారు. అతను 1973లో ఇంగ్లిష్‌ గిటారిస్ట్‌ జాస్‌ మెక్‌లాగ్లిన్‌, వయోలిన్‌ వాద్యకారుడు ఎల్‌ శంకర్‌, పెర్కెషన్‌ వాద్యకారుడు టీహెచ్‌ విక్కు వినాయక్‌రామ్‌తో కలిసి చేసిన సంగీత ప్రాజెక్టు సంగీత ప్రియులను కొత్త లోకంలోకి తీసుకువెళ్లింది. జాకీర్‌ హుస్సేన్‌ నటుడు కూడా. ఆయన శశికపూర్‌తో ఒక హాలీవుడ్‌తో పాటు పలు బాలీవుడ్‌ చిత్రాలలో నటించారు.

కాగా, హుస్సేన్‌ మృతికి పలువురు సంగీతకారులు, నటులు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 1951లో ముంబయిలో జన్మించిన జాకీర్‌ తండ్రి ఉస్తాద్‌ అల్లా రఖా ఖాన్‌ కూడా ప్రముఖ తబలా సంగీతకారుడే. భారత శాస్త్రీయ సంగీతంలో జాకీర్‌ తనదైన ముద్ర వేశారు. తండ్రి వద్దనే సంగీతాన్ని అభ్యసించి ఏడేండ్ల వయసులోనే ఆయన కచేరీలలో తబలా వాయించే వారు. ముంబైలో గ్రాడ్యుయేషన్‌, జాకీర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ నుంచి సంగీతంలో డాక్టోరల్‌ డిగ్రీని పూర్తి చేశారు.

Related Posts
కలెక్టర్ మీద దాడి ఘటనలో సురేశ్‌ కోసం గాలింపు – పోలీసులు
Suresh in attack on collect

వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ మీద దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ గా మారింది. ఈ ప్రాంతంలో మెగా ప్రాజెక్ట్ కట్టాలని ప్రభుత్వం భావిస్తే…ఆ ప్రాజెక్ట్ Read more

ఢిల్లీలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికలు
delhi

ఢిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమవ్వగా.. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ జరగనుంది. దాదాపు 1.56 కోట్ల Read more

ట్రుడో నాయకత్వం పై చంద్రా ఆర్యా వ్యాఖ్యలు..
chandra arya

కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో నాయకత్వం గురించి అనిశ్చితి పెరిగింది. కెనడా పార్లమెంట్ సభ్యుడు చంద్రా ఆర్యా ఇటీవల ఒక ప్రకటన చేస్తూ, ట్రుడోని లిబరల్ పార్టీ Read more

‘స్థానిక’ ఎన్నికలు.. నేడు పోలింగ్ కేంద్రాల జాబితా
'Local' elections.. List of polling centers released today

ఎన్నికల సిబ్బందికి శిక్షణనూ పూర్తిచేయండి.. డైరెక్టర్‌ సృజన హైదరాబాద్‌: స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ సృజన అధికారులకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *