USA పోలాండ్ లో విజ్ఞప్తికి నో చెప్పిన ట్రంప్

USA: పోలాండ్ లో విజ్ఞప్తికి నో చెప్పిన ట్రంప్

USA: పోలాండ్ లో విజ్ఞప్తికి నో చెప్పిన ట్రంప్ రష్యా నుంచి ఎదురయ్యే ముప్పును తిప్పికొట్టేందుకు తమ దేశంలోనే అమెరికా అణ్వాయుధాలను మోహరించాలని కోరిన పోలాండ్ అభ్యర్థనకు అమెరికా నిరాకరణ తెలిపింది. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రతిపాదనను స్వీకరించలేదని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ ఐరోపాలో కాకుండా తూర్పు యూరప్‌లోని పోలాండ్‌లోనే అమెరికా అణ్వాయుధాలను భద్రపరచాలని ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెజ్ డూడా గతంలో ప్రస్తావించారు. అయితే, అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ప్రతిపాదనను నేరుగా తిరస్కరించారు. ఇప్పుడు ట్రంప్ అధ్యక్షతన కూడా ఇదే నిర్ణయం కొనసాగుతుందని వాన్స్ వెల్లడించారు.

USA పోలాండ్ లో విజ్ఞప్తికి నో చెప్పిన ట్రంప్
USA పోలాండ్ లో విజ్ఞప్తికి నో చెప్పిన ట్రంప్

ఈ విషయంపై మాట్లాడుతూ, తాను ట్రంప్‌తో చర్చించినట్టు వాన్స్ తెలిపారు. తూర్పు యూరప్‌లో అణ్వాయుధాలను విస్తరించాలన్న అంశానికి ట్రంప్ మద్దతు ఇస్తే తనకు నిజంగా ఆశ్చర్యమేనని పేర్కొన్నారు. ఇదే సమయంలో బైడెన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బైడెన్ ప్రభుత్వం అంతర్జాతీయ వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్య ధోరణిని అవలంబించిందని వాన్స్ ఆరోపించారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందించడం వల్ల మాస్కో, కీవ్‌ల మధ్య వివాదం మరింత తీవ్రరూపం దాల్చిందని విమర్శించారు. ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగినట్లయితే ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం వచ్చేవాటికాదని అభిప్రాయపడ్డారు.ఇప్పటికే నాటో దళాలు తూర్పు యూరప్ సరిహద్దుల్లో మోహరించడంతో రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో పోలాండ్ మళ్లీ అమెరికా అణ్వాయుధాలను తమ భూభాగంలో మోహరించాలని కోరడం గమనార్హం. మరోవైపు, ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న సమయంలోనే ఈ అభ్యర్థన రావడం వివాదాస్పదంగా మారింది. పోలాండ్ అమెరికా మద్దతును కోరుకుంటూనే ఉంది. కానీ, అమెరికా మాత్రం తూర్పు యూరప్‌లో అణ్వాయుధాల ప్రస్తావన రష్యాతో సంబంధాలను మరింత విపరీతంగా చేసేస్తుందనే ఉద్దేశంతో దీనిని తిరస్కరించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో అమెరికా-పోలాండ్ సంబంధాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాల్సి ఉంది.

Related Posts
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా పటేల్
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా పటేల్

అమెరికా ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా భారతీయ సంతతికి చెందిన కాష్ పటేల్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి సంబంధించిన తీర్మానానికి సెనెట్ Read more

విద్యకు రూ.2,506 కోట్లు.. బడ్జెట్ హైలైట్స్
బడ్జెట్లో భారీగా రాజధాని అమరావతికి కేటాయింపులు

అప్పు తీసుకొనే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ అమరావతి: ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3.22 లక్షల Read more

చేనేత వస్త్రంపై చంద్రబాబు ఫ్యామిలీ ఫొటో
lokesh chenetha

మంగళగిరికి చెందిన టీడీపీ అభిమాని జంజనం మల్లేశ్వరరావు, ఆయన కుమారుడు కార్తికేయ మంత్రి నారా లోకేశ్కు ప్రత్యేకమైన బహుమతిని అందజేశారు. వారు చేతితో నేసిన చేనేత వస్త్రంపై Read more

శబరిమల భక్తులకు దేవస్థానం బోర్డు శుభవార్త
Good news from the temple board for Sabarimala devotees

తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. సన్నిధానం వద్ద 18 మెట్లను నేరుగానే ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం Read more