అమెరికాలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అత్యాధునికమైన యుద్ధ విమానం ఎఫ్-35 (F35 jet) శిక్షణ సమయంలో ప్రమాదవశాత్తూ కూలిపోయింది. కాలిఫోర్నియా (California) లోని ఫ్రెస్నో నగరానికి సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
శిక్షణ సమయంలో ప్రమాదం
ఈ రోజు ఉదయం అమెరికా కాలమానం ప్రకారం 6:30 గంటల సమయంలో, ఫ్రెస్నో నగరానికి సుమారు 64 కిలోమీటర్ల దూరంలో ఈ యుద్ధ విమానం (Fighter Jet) కూలిపోయిందని అమెరికా నేవీ అధికారికంగా ప్రకటించింది. ప్రమాద సమయంలో పైలట్ శిక్షణ తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
పైలట్ ప్రాణాపాయం తప్పింది
విమానంలో ప్రమాదం ఏర్పడిన వెంటనే పైలట్ అప్రమత్తమై పారాచూట్ సాయంతో బయటకు దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే అతడికి స్వల్పంగా గాయాలైనట్లు సమాచారం. వెంటనే అతడిని వైద్య సాయం కోసం సమీపంలోని విమానాశ్రయంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది.
మంటలు అదుపులోకి
విమాన కూలిన తర్వాత ప్రమాదస్థలంలో తీవ్ర మంటలు వ్యాపించాయి. స్థానిక అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై ప్రాథమికంగా విచారణ ప్రారంభమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూలుతున్న ఎఫ్-35 (F35 jet) విమానం, ఆపై ఎగిసిపడుతున్న మంటలు ప్రజల్లో ఆందోళన రేపుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: Donald Trump: పాకిస్తాన్ చమురు భారత్‌కు అమ్మకంపై ట్రంప్ ప్రకటన